శ్రీ త్యాగరాజు వంటి సద్గురువులు అకుంఠిత దీక్షతో వేలకొలది కీర్తనలను రచించి, దక్షిణభారత శాస్త్రీయ సంగీతానికి రూపకల్పన చేయగా, ఆ కీర్తనలను శాస్త్రీయ బద్ధంగా నేర్చుకొని వాడ వాడలా ఆలపించి సకల జనావళికి పరిచయం చేసిన ఎంతోమంది సంగీత విద్వాంసులు ఉన్నారు. అటువంటి వారిలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు. వేలకొలది కచేరీలు ప్రపంచవ్యాప్తంగా చేసి కర్నాటక సంగీతం యొక్క ఉనికిని, గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఆ మహానుభావుని జయంతిని పురస్కరించుకొని గుప్పెడు మనసు చిత్రం కోసం ఆయన ఆలపించిన ఈ తాత్విక వేదాంత భావపూరిత ఆణిముత్యం మీ కోసం అందిస్తున్నాము.
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానె కన్నీరౌతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా..
చీకటి గుహ నీవు చింతల చెలి నీవూ
చీకటి గుహ నీవూ చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానె కన్నీరౌతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా..
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవూ
కోర్కెల సెల నీవూ కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానె కన్నీరౌతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా..