దశమ అధ్యాయం (“పారా, పశ్యంతి, మధ్యమ, వైఖరి” - అమ్మవారి శ్రీ చక్రవర్ణన)
శ్లోకాలు: 71-81, సహస్రనామాలు: 305-372
రాజరాజు-అంటే కుబేరుడు, మనువు- వీరిచే అర్చించిన దేవికి వందనాలు.
రాజ్ఞీమ తల్లికి ప్రణామాలు.
సౌందర్యరాశికి వందనాలు.
పద్మముల వంటి విశాలసుందర నయనాలు కల తల్లికి నమోవాకాలు.
భక్తులను రంజింపజేయునట్టి మాతకు ప్రణామాలు.
స్త్రీ లలో సర్వోత్కృష్ట స్థానంలో తేజరిల్లునట్టి పరమేశ్వరికి వందనాలు.
ఆస్వాదనయోగ్యమగు మహేశ్వరికి వందనాలు.
కింకిణులు మధురనాదాలు చేయి మెరయునట్టి మొలనూలును ధరించిన మాతకు ప్రణామాలు.
లక్ష్మీ స్వరూపిణియగు లలితా మాతకు ప్రణామాలు.
పూర్ణచంద్రాననకు వందనాలు.
రతిదేవి స్వరూపాన్ని అధిగమించిన సుందరరూపంగల తల్లికి వందనాలు.
రతీదేవికు ప్రియమైన లలితాంబకు వందనాలు.
లోకాలకు రక్షణ కలిగించునట్టి మాతకు వందనాలు.
రాక్షసులను అంతం చేయునట్టి దేవికి వందనాలు.
రామారూపిణికి ప్రణామాలు.
రమణులచే లంపటయై కోమాంగులచే పరివేష్టితయై క్రీడించు మాతకు నమస్కారాలు.
ముముక్షువులచే, జ్ఞానులచే కోరబడు దేవికి వందనాలు.
కామకలా స్వరూపిణికి అంటే కోరదగిన కళయే స్వరూపంగా గల దేవికి వందనాలు.
కదంబ పుష్పాలయందు ప్రీతిగల మాతకు ప్రణామాలు.
కళ్యాణమయ--అంటే మంగళమయ స్వరూపిణికి ప్రణామాలు.
జగత్తులకు మూలకందమైన దేవికి వందనాలు.
సముద్రం వంటి అపార కరుణకల తల్లికి నమస్కారాలు.
సమస్త కళలు గల లలితాంబకు వందనాలు.
కలభాషిణికి--మధురంగా ఆలపించునట్టి తల్లికి వందనాలు.
మనోహర కాంతా స్వరూపిణికి వందనాలు.
కాదంబరి యందు ప్రియముకల దేవికి వందనాలు.
వరములు ప్రసాదించునట్టి తల్లికి ప్రణామాలు.
సుందరమైన నయనాలు కల దేవికి వందనాలు.
వారుణిని పాపం చేసి ఆ మదంచే విహ్వలమైన జగజ్జననికి వందనాలు.