Menu Close
Lalitha-Sahasranamam-PR page title

ప్రథమ అధ్యాయం

(అమ్మవారి స్థూలరూప వర్ణన) శ్లోకాలు: 01-21, సహస్రనామాలు: 01-54

006. ఓం ఉద్యద్భాను సహస్రాభాయై నమః

వేయిమంది బాలభాస్కర ప్రభలతో తేజరిల్లు తల్లికి వందనాలు.


007. ఓం చతుర్భాహు సమన్వితాయై నమః

చతుర్భుజాలతో భక్తజన సంరక్షణ చేయు తల్లికి వందనాలు.


008. ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః

వామపార్శ్వోపరిహస్తములో రాగరూపపాశాన్ని ధరించిన తల్లికి వందనాలు.


009. ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః

దక్షిణ పార్శ్వోపరిహస్తలలో క్రోధరూపాంకుశాన్ని ధరించి తేజరిల్లునట్టి మాతకు నమస్కారాలు.


010. ఓం మనోరూపేక్షు కోదండాయై నమః

మనోరూపమైన చెఱకు విల్లును క్రింది ఎడమచేత ధరించిన శ్రీ లలితకు వందనాలు.


011. ఓం పంచతన్మాత్రసాయకాయై నమః

శబ్దస్పర్శరూప రసగంధాలను పంచతన్మాత్రలంటారు. ఆ తన్మాత్ర పంచకమే దేవివామభాగంలోని క్రింది హస్తంలో పంచభాగాలు భాసిల్లుతున్నాయి. అట్టి బాణాలను ధరించిన తల్లికి వందనాలు.


012. ఓం నిజారుణ ప్రభాపూర మజ్ఞద్బ్రహ్మాండలాయై నమః

తన అరుణ శరీరకాంతుల ద్వారా బ్రహ్మాండమండలాన్ని తేజరిల్లజేయునట్టి తల్లికి వందనాలు.


013. ఓం చంపకాశోక పున్నాగ సౌగంధకలసత్కచాయై నమః

చంపకాశోక పున్నాగ సౌగంధిక పుష్పగుచ్ఛాలతో ప్రకాశించుచూ గుబాళించుచున్న కచభాగంగల దేవికి వందనాలు.


014. ఓం కురువిందమణి శ్రేణీకనత్కోటీర మండితాయై నమః

కురువిందమణి శ్రేణులతో ప్రకాశించు కిరీటాన్ని ధరించిన దేవికి వందనాలు.


015. ఓం అష్టమీచంద్రవిభ్రాజదళిక స్థలశోభితాయై నమః

సమానార్ధ భాగమైన భో సీమను ప్రకాశింపజేయునట్టి అష్టమీ చంద్రశోభలతో రాజిల్లు లలాటసీమ గలిగిన తల్లికి నమస్కారాలు.


016. ఓం ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషకాయై నమః

చంద్రబింబంలోని మచ్చవలె చంద్రబింబానన అయిన తల్లి ఫాలభాగంలో కస్తూరీ తిలకంచే భాసిల్లునట్టి తల్లికి వందనాలు.


017. ఓం వదనస్మరమాంగళ్యగృహ తోరణ చిల్లికాయై నమః

లలితవదన సీమ మన్మధుని మంగళగృహంలా ఉన్నది. అట్టి గృహానికి ఆమె కనుబొమలే మంగళతోరణాలుగా ప్రకాశించ అట్టి మంగళమూర్తికి నమోవాకాలు.


018. ఓం వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనాయై నమః

వదన లక్ష్మీ ప్రవాహంలో ప్రకాశిస్తూన్న మీనాలవంటి నయనాలు కల తల్లికి వందనాలు.


019. ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః

నూతనంగా వికసించిన సంపెంగ పుష్ప సమాన నాసిక గల తల్లికి వందనాలు.


020. ఓం తారాకాంతి తిరస్కార నాసాభరణ భాసురాయై నమః

తారలకాంతిని తిరస్కరించిన కాంతితో ప్రకాశించుచున్న అడ్డబాసను ధరించిన దేవికి వందనాలు.


021. ఓం కదంబమంజరీక్లుప్తకర్ణపూర మనోహరాయై నమః

కదంబ పుష్పమంజరితో మనోహరంగా ఉన్న కర్ణభాగంకల తల్లికి వందనాలు.


022. ఓం తాటంకయుగళీభూత తపనోడుప మండలాయై నమః

‌సూర్యచంద్రులవలె భాసిల్లునట్టి తాటంకయుగళాన్ని ధరించి తేజరిల్లు శ్రీ దేవి నమస్కారాలు. సూర్యచంద్రులనే తాటంకాలుగా ధరించగలిగిన మహామహిమాన్వితకు ప్రణామములని విశేషార్ధము.


023. ఓం పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూః నమః

అద్దముకన్న నునుపుగా ఎదుటివస్తువులను ప్రతిఫలింపజేయునంతటి స్వచ్ఛముగను, పద్మ రాగమణి ప్రభలవలె అరుణారుణంగా తేజరిల్లుతూన్న కపోలాలు కల పరమేశ్వరికి వందనాలు.


024. ఓం నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి రదనచ్ఛదాయై నమః

నవ్యంగా ఉదయించిన పగడపు తీగవలె నున్నగాను, చక్కగా పండిన దొండపండువలె ఎఱ్ఱగాను ఉన్న పెదవులుగల పరమేశ్వరికి వందనాలు.


025. ఓం శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలాయైనమః

షోడశాక్షరీ మహామంత్రంలోని పదహారు అక్షరాలే -- శివశక్తి భావంతో 16+16 ముప్పై రెండు దంతాలుగల జననికి వందనాలు.


026. ఓం కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరాయై నమః

దేవి వేసికొన్న కర్పూరమిశ్రిత తాంబూల పరిమళించే దిగంతరాలు ఆకర్షించబడుచున్నవి. అట్టి శ్రీదేవికి వందనాలు.


027. ఓం నిజసల్లాప మాధుర్య వినిర్బర్సిత కచ్ఛప్యై నమః

శారదాదేవి వాయించు కచ్ఛపీ వీణానాదాలను తిరస్కరించునట్టి నిజమాధుర్య సల్లాపాలుగల తల్లికి వందనాలు.


028. ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసాయై నమః

తన చిరునవ్వుల కాంతిపుంజాలచే ముంచుచున్న కామేశ్వరుని మనస్సు కల శ్రీమాతకు వందనాలు.


029. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః

అసామాన్యమైన గోళాకృతిలోనున్న చుబుక(గడ్డము) భాగముచే తేజరిల్లు దేవికి వందనాలు.


030. ఓం కామేశబద్ధ మాంగళ్యసూత్ర శోభితకంధరాయై నమః

కామేశ్వరునికి కట్టబడిన మంగళసూత్రంతో కూడి సుందరగళసీమతో భాసిల్లు దేవికి వందనాలు.

----సశేషం----

Posted in February 2022, ఆధ్యాత్మికము

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!