Menu Close
Kadambam Page Title
కొత్త ఆశలను పండిద్దాం
కర్రి. మల్లీశ్వరి

నూతన ఉత్తేజంతో
చిగురించిన
కొత్త ఆశలకు
రంగురంగుల సుమ
కుసుమాల పందిరి వేద్దాం.

గడిచిన వసంతాలను
తలుచుకొని
ఆనందాలను
నెమరు వేసుకుని,
తప్పులను, సరిదిద్దుకొనే అవకాశాన్ని
అందిపుచ్చుకొని
కొత్త వసంతానికి
ఎదురు వెళదాం.

గతపు విషాద గోతులను
కాలంతో పూడ్చివేద్దాం
మంచి అనే మానవత్వానికి
మెరుగులు దిద్దుదాం
తొలి అడుగు నీదిగా
నీలో ఉన్న
అజ్ఞానాన్ని తరిమి,
ప్రభాత వెలుగు వైపు
అడుగులు వేద్దాం.

బాధలను బరువుగా కాక
బాధ్యతగా ధైర్యంగా ఎదుర్కొని
బంధాల ఇంద్రధనస్సుల రంగులతో
నవ వసంతానికి స్వాగతం పలుకుదాం.
నవ వసంతపు స్ఫూర్తితో
కొత్త చైతన్యపు ఆశలను నవ్వుల పువ్వులతో
పండిద్దాం.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Posted in January 2023, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *