కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం
హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్
పులకించిన కాలపు ఒడిలో పురివిప్పినదో స్వరపుష్పం
చిరు నవ్వులు వీణలు మీటి వినిపించిందో నవరాగం
హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్
కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం
హ్యాపీ న్యూ ఇయర్
ఓ జాబిలీ నా నెచ్చెలీ విన్నానులే నీవన్నమాట
నా కోసమే వస్తావని కట్టానులే ఓ కన్నెతోట
అణువణువూ నిన్ను తడిమే చూపులకే ఎంత మహిమో
అనుక్షణము నిన్ను పిలిచే పెదవులకి ఎంత సుఖమో
ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా
మనసులో ఉన్నదీ ఓ మాట
తెలుపనా కమ్మగా ఈ పూట
ప్రియా ఓ ప్రియా
ఓ నేస్తమా ఓ నేస్తమా
చిరుగాలితో చిరుగాలితో
కబురంపినా కబురంపినా నే నాగలేక
ఓ జానెమన్ ఓ జానెమన్
మేడ్ ఇన్ హెవెన్ మేడ్ ఇన్ హెవెన్
రాసేయనా రాసేయనా ఓ ప్రేమలేఖ
విరహమునే మంచుతెరలో చిక్కినదో లేత పరువం
కౌగిలిలో వెచ్చబడితే కరుగునులే కన్నె బిడియం
ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా
మనసులో ఉన్నదీ ఓ మాట
తెలుపనా కమ్మగా ఈ పూట
ప్రియా ఓ ప్రియా
పులకించిన కాలపు ఒడిలో పురివిప్పినదో స్వరపుష్పం
ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా