కార్తీకం
మ.
ప్రతిమాసంబునఁ బౌర్ణమిన్ విధుడు దారన్ జేరు నొక్కంటిఁ దా
నతిప్రేమన్; నెలపేరు దాని కతనన్ వ్యక్తంబగున్; గృత్తికన్
సతిగా నవ్విధిఁ గూడఁ గార్తిక మగున్; సత్సంప్రదాయంబులన్
ప్రతిరో జొక్క సుపర్వమై యొసఁగుఁ బుణ్యంబుల్ శుభావాప్తికిన్ 1
నతిప్రేమన్; నెలపేరు దాని కతనన్ వ్యక్తంబగున్; గృత్తికన్
సతిగా నవ్విధిఁ గూడఁ గార్తిక మగున్; సత్సంప్రదాయంబులన్
ప్రతిరో జొక్క సుపర్వమై యొసఁగుఁ బుణ్యంబుల్ శుభావాప్తికిన్ 1
తే.గీ.
దానధర్మాల కాటపట్టైన కాల
మిదియె శివకేశవాభేద మెదల నిండ
హరిహరాలయసేవల నహరహంబు
పాపతిమిరంబు బాపెడు దీపశిఖలు 2
మిదియె శివకేశవాభేద మెదల నిండ
హరిహరాలయసేవల నహరహంబు
పాపతిమిరంబు బాపెడు దీపశిఖలు 2
తే.గీ.
నామసంకీర్తనమ్ములు జ్ఞానమొసఁగి
భక్తిమర్గాన నడిపించు ప్రవచనములు
పూజ లారాధనలు వ్రతమ్ములును సత్య
మైన నక్తమ్ములును దీని కంగములగు 3
భక్తిమర్గాన నడిపించు ప్రవచనములు
పూజ లారాధనలు వ్రతమ్ములును సత్య
మైన నక్తమ్ములును దీని కంగములగు 3
నందివర్ధనము
చేసినట్టికృషి చిన్నదైనఁ ఘనసిద్ధినిచ్చు ఫలముల్
దాసులెల్లరకు దక్కఁజేయు నిది, దానఁ దాప మడఁగున్
వాసవాదిసురసంస్కృతస్తుతుల వాసికెక్కు సమయం
బే సమం బెటను లేని దియ్యదియె యెట్టివారికయినన్ 4
కం.
తులసీధాత్రీ(1)పూజలు
కలిసి వనస్పతిఫలాలు కలుగఁగ బోన
మ్ములు వనములఁ జేయు జన
మ్ములు కార్తికమే యొసంగు ముచ్చట లగుఁగా 5
............(1) ఉసిరిక
కలిసి వనస్పతిఫలాలు కలుగఁగ బోన
మ్ములు వనములఁ జేయు జన
మ్ములు కార్తికమే యొసంగు ముచ్చట లగుఁగా 5
............(1) ఉసిరిక