Menu Close
Kadambam Page Title
ఎలా ...!!
-- డా.కె.ఎల్.వి.ప్రసాద్

నువ్వూ ..నేనూ ...
ఎప్పుడూ ఇంతే,
అపార్దాల వాగులో
అన్యాయంగా
కొట్టుకుపోవలసిందే!

విమర్సల దాడిలో,
నువ్వొక మెట్టు ఎక్కుతావు,
నేనూ రెచ్చిపోయి,
నీకు ....
రెట్టింపు అయిపోతాను,
మాటా ..మాటా ..పెరిగి,
నిన్ను నువ్వు
సమర్దించేసుకుంటావు,
నాకు మింగుడు పడక,
నన్ను నేను
అదుపు చేసుకోలేక,
నాకు నేనే ..నీకు
దూరమైపోతుంటాను!

మనప్రశ్నలు - సమాధానాలు,
మనవరకే ....
పరిమితం అంటాను నేను,
అది మరచిన నువ్వు,
నీ మస్తిష్క పేటికలో,
నిక్షిప్తం కావాల్సిన,
స్వీయ గాథలు
నా హృదయ వాకిటముందు
గుట్టలుగా ఆరబోస్తావు,
నాలోని అహంకారిని
తట్టి లేపుతావు ...
ఈర్ష్యా ద్వేషాల
మురికి గుంటలోకి
నిర్దాక్షిణ్యంగా ..
నన్ను తోసిపారేస్తావు !

నాలో రగిలే కుతకుతలు
నీకు వినపడవు,
నువ్వు మాత్రం,
సత్యమూర్తిలా
నీ హృదయం విప్పి
నా ..ముందు
కుప్పపోస్తావు ...!
నన్నొక శాడిస్టుని చేసి,
నాలో ...
అగ్నిజ్వాల రగిలించి,
మానసిక వ్యథకు
మూల సూత్రమైపోతావు!!

నాకు తెలుసు
నీ ..ఆలోచనలన్నీ
నా చుట్టూ ...
పరిభ్రమిస్తున్నాయని,
నాగురించి
ఇంతకుమించి
ఏమిచెప్పను .....
నేను రాసే ...
ప్రతి అక్షరం లోనూ ..
వెంటాడే ప్రతి
ఆలోచనలోనూ
నువ్వే ..నువ్వే ..
ప్రత్యక్ష మవుతుంటావని,
ఎలా ..చెప్పనూ ...!?

Posted in August 2020, కవితలు

16 Comments

  1. చిట్టె మాధవి

    నేటి మనుషుల మనస్తత్వం…ఇక్కడ ఎవ్వరూ అతీతులు కారు…బాగా వ్రాశారు సర్

  2. D.Nagajyothi

    ఎలా ఇలా మీ మనస్సు సంఘర్షణని అందమైన వాక్యాలుగా మార్చారు… బావుంది సర్ కవిత

  3. Rajendra Prasad

    కవితలో లోతైన అర్థం, ప్రాక్టికల్ ట్రూత్ ఉన్నాయి. చాలా ఆలోచించి effort పెట్టి రాసి ఉంటారు. అభినందనలు.👏👏👏👏💐💐💐

  4. సెల్..7989665525

    ప్రసాద్ గారూ మీ కవిత “ఎలా” చాలా బాగుంది, మా మనసుని విప్పి చెప్పినట్లుగా ఉంది, ఇది చదివిన ఎవరికి వారు అలానే ఊహించుకుంటారు, అభినందనలు సార్,

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!