Menu Close
Geethanjali-page-title

29

HE whom I enclose with my name is weeping in this dungeon. I am ever busy building this wall all around; and as this wall goes up into the sky day by day I lose sight of my true being in its dark shadow.

I take pride in this great wall, and I plaster it with dust and sand lest a least hole should be left in this name; and for all the care I take I lose sight of my true being.

సీ. నామ రూపములిచ్చి నాల్గుగోడల మధ్య
     వగచు వీనినటులె వదలి వైచి

     కష్టపడుచు చుట్టు, కట్టితీ హర్మ్యమ్ము
     ఆకాశమంటగా అహరహమ్ము

     నింగి చేరిన గోడ నీడలో కోల్పోతి
     నాదు సహజరూప మాదమరచి 

     గర్వపడితినేను గగనమంటిన సౌధ
     రాజసమ్మును జూచి రోజు రోజు

ఆ‌. ఇటుక ఇటుక పేర్చి ఎంతయో ప్రేమతో
     కట్టుకున్న ఇంటి గదుల నడుమ
     కానలేక నన్ను కన్నీరు నించితిన్
     నిలయ ద్వారమందు కలయ జూచి

30

I CAME out alone on my way to my tryst. But who is this that follows me in the silent dark?

I move aside to avoid his presence but I escape him not.

He makes the dust rise from the earth with his swagger; he adds his loud voice to every word that I utter.

He is my own little self, my lord, he knows no shame; but I am ashamed to come to thy door in his company.

సీ. సడిలేని సంధ్యలో, సఖుని జేర, వడిగ,
     ఏకాంతముగ నేను, యేగుచుంటి

     నావెంట ఎవరొకో!  నడచివచ్చెడి వారు!!
     వెలుతురణగి పోవ తెలియకుంటి!

     తప్పించుకొన జూచి దారినిచ్చితి నేను
     వెంబడించు నటులె వింతగతడు!!

     పెదవి విప్పగ నేను, రొదజేసి జతకల్పు
     ధూర్తతనము తోడ, ధూళి రేపు!!

ఆ. నవులపాలు జేయు నాయహమ్మే వాడు,
     సిగ్గుపడుదు నతడు చెంత నుండ‌!
     ఎటుల జూతు స్వామి యిపుడునీ సన్నిధి!
     వేచియుంటి నిటులె వేళ కొరకు!!

31

"PRISONER, tell me, who was it that bound you?"

"It was my master," said the prisoner.

"I thought I could outdo everybody in the world in wealth and power, and I amassed in my own treasure-house the money due to my king.

When sleep overcame me I lay upon the bed that was for my lord, and on waking up I found I was a prisoner in my own treasure-house."

"Prisoner, tell me who was it that wrought this unbreakable chain?" "It was I," said the prisoner, "who forged this chain very carefully. I thought my invincible power would hold the world captive leaving me in a freedom undisturbed.

Thus night and day I worked at the chain with huge fires and cruel hard strokes. When at last the work was done and the links were complete and unbreakable, I found that it held me in its grip."

సీ. "ఎవరు బంధించినా రివ్విధమున నిన్ను!!
     గట్టి సంకలియల కట్టి వైచి?!"

     "పట్టి బంధించె నా ప్రభువే యిటుల" నంచు
     బదులుపల్కె బంది, బాధపడుచు

     "ప్రభుని ధనముతోడ భవనమ్ము నింపితి
     కలిమితో యితరులన్ గెలుతునంచు

     ప్రభుని కొరకుయున్న పల్యంకమున నేను
     అలసి నిదురబోతి ఆదమరచి

ఆ. కనులు తెరచి జూడ కఠినశృంఖల మందు
     కట్టి వేయ బడుచు గంటి నన్ను
     పలుకు మాని, యెదుట పసిడిసౌధమునందు
     నిలచి పోతి నటులె తలపులందు"

సీ. "ముడిదీయగ రాని ముళ్ళసంకెళ్ళతో
     ఎవరు కట్టిరిదెల్పు ఇటుల నిన్ను"?

     "ఎనలేని సంపదల్ ఘనమగు భవనముల్
     తరగిపోవను నాదు తలపు చేత

     సకల భువిని నేనె శాసించ లేనిచో,
     స్వేచ్ఛలేదను నాదు వెరపు చేత

     జగతి జనుల కట్టు నిగళమ్ము చేసితి
     మెరయు దాని గనుచు మురిసిపోతి

ఆ. అహరహమ్ము లందు అతికష్టములనోర్చి,
     నిప్పులోన కాల్చి నీట ముంచి,
     గట్టి గొలుసు చేసి కడకుచిక్కితిటుల!!!
     నిగళ బంధనముల వగచి నేను!" 

32

BY all means they try to hold me secure who love me in this world. But it is otherwise with thy love which is greater than theirs, and thou keepest me free.

Lest I forget them they never venture to leave me alone. But day passes by after day and thou art not seen.

If I call not thee in my prayers, if I keep not thee in my heart, thy love for me still waits for my love.

సీ. నన్ను ప్రేమింతురు నావారు వీరెల్ల
     బిగియ కట్టెదరోయి ప్రేమ లోన

     అపురూపమైనదే అఖిలేశ నీప్రేమ
     చెరగిపోక యెపుడు స్వేచ్ఛనొసగు
     ---
     మరతునేమో యన్న వెరపుచే వారెల్ల
     కనులముందు నిలిపి గాతు రెపుడు!

     దినములెన్ని యిటుల తీరిపోయిన గాని
     ఎదుట పడవు‌నీవు ఏమి వింత!!!

ఆ. పూజ సేయలేదు పుష్పాలు తేలేదు!
     ఎదను నిలుపలేదు ఎన్నడైన!
     ఏమి సేయకున్న యీశ! నాప్రేమకై,
     నీదు ప్రేమయటులె నిలచి యుండు!!

33

WHEN it was day they came into my house and said, "We shall only take the smallest room here."

They said, "We shall help you in the worship of your God and humbly accept only our own share of his grace"; and then they took their seat in a corner and they sat quiet and meek.

But in the darkness of night I find they break into my sacred shrine, strong and turbulent, and snatch with unholy greed the offerings from God's altar.

సీ. ఒకనాటి ఉదయమ్ము, ఉండగా మాయింట
     అరుగుదెంచిరి వారు అణిగి మణిగి

     "చిన్నచోటే చాలు చేయబోమల్లరి
     మూలగదియె మాకు చాలునోయి"

     "నిత్యపూజలయందు నీకుతోడుగ యుండి
     భుక్తశేషము గొని మురిసి పోదు"

     మనుచు పల్కిన వారు అలజడి సేయక
     విడిదిచేసిరి అతి వినయములతొ

ఆ. అర్ధ రాత్రి వేళ, అలికిడై నన్ జూతు
     గర్భగుడిని దూరి అర్భకులుగ
     స్వామికొరకు చేయు సర్వమ్ము దోచిరి
     హద్దు లేని వారి ఆశ చేత!!!

34

LET only that little be left of me whereby I may name thee my all.

Let only that little be left of my will whereby I may feel thee on every side, and come to thee in everything, and offer to thee my love every moment.

Let only that little be left of me whereby I may never hide thee.

Let only that little of my fetters be left whereby I am bound with thy will, and thy purpose is carried out in my life ↓ and that is the fetter of thy love.

సీ. నాదన్నదేదైన నీదన్న భావమ్ము
     నిలిచిపోనీ ప్రభూ! నిలిచి పోని!!

     స్వేచ్ఛ నాకున్నచో విశ్వమంతట నిన్నె
     నిలుపుకోనీ ప్రభూ! నిలుపు కోని!!

     నాదారులన్నియూ నీదేవళమునకే,
     చేరనీవో ప్రభూ! చేరనిమ్ము!!

     నిన్నెచూపించనీ, నీకె అర్పించనీ,
     నిరతమ్ము నా ప్రేమ నీదు మ్రోల

ఆ. నన్ను కట్టి వైచి నాథ నీ యాజ్ఞలో
     మెలగనిమ్ము స్వామి, వెలగ నిమ్ము!!
     స్వామికార్యమందు సాగనీ జీవమ్ము
     పండనిమ్ము ప్రేమ బంధనమ్ము!!!

35

WHERE the mind is without fear and the head is held high; Where knowledge is free;
Where the world has not been broken up into fragments by narrow domestic walls; Where words come out from the depth of truth;
Where tireless striving stretches its arms towards perfection;
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever-widening thought and action ↓
Into that heaven of freedom, my Father, let my country awake.

సీ. ధైర్యమ్ము నెదనుంచి, తలనెత్తి జీవించి
     స్వేచ్ఛగా జ్ఞానమ్ము వెలుగు నెచట

     కుంచితమౌ భావ కుడ్యములన్ భువి
     ఖండమ్ములైపోక కలయు నెచట

     సత్యగర్భితమైన సంభాషణ లెచట
     సత్కర్మలన్ కూడి సఫలమగునొ

     నిస్సార కర్మలన్ నిలిచిపోక విమల
     ఆలోచనాఝరుల్ అలరునెచట

ఆ. మనసు, కర్మలు మతిననుసరించు నెచట
     నీదు బాట బుద్ధి నిలుచు నెచట,
     అచట మేలుకొలుపు మఖిల భారతమును
     శాంతి సుఖములొసగు స్వర్గ మనగ!!

36

THIS is my prayer to thee, my lord ↓ strike, strike at the root of penury in my heart.

Give me the strength lightly to bear my joys and sorrows.

Give me the strength never to disown the poor or bend my knees before insolent might.

Give me the strength to make my love fruitful in service.

Give me the strength to raise my mind high above daily trifles. And give me the strength to surrender my strength to thy will with love.

     ఇదియె నా ప్రార్థన ప్రభూ!

సీ. వదలక బాధించు భావదారిద్ర్యంబు,
     కూకటి వేళ్ళతో కూల్చి వేయు

     కష్ట సుఖములందు కదలిపోకన్, వాని
     చిరునవ్వుతో దాటు చేవనిమ్ము

     బలగర్వులయెదుట పడక మోకాళ్ళపై,
     పేదలన్ ప్రేమించు పేర్మినిమ్ము

     పండనీ నాప్రేమ పరమాత్మ సేవలో
     నిండనీ జగమెల్ల నీదు కరుణ

ఆ. అల్ప విషయములను అధిగమించెడు శక్తి
     నీదు సేవలోన నిలుచు భక్తి
     అన్ని నీవె యనుచు అర్పించు అనురక్తి
     ఇంతె చాలునోయి ఈశ నాకు!! 

37

I THOUGHT that my voyage had come to its end at the last limit of my power, ↓ that the path before me was closed, that provisions were exhausted and the time come to take shelter in a silent obscurity.

But I find that thy will knows no end in me. And when old words die out on the tongue, new melodies break forth from the heart; and where the old tracks are lost, new country is revealed with its wonders.

సీ. ఒడలు బడలిపోయె ఓపికయు నశించె
     యాత్ర ముగిసెనంచు ఆగి పోతి

     ముందుకేగెడు దారి మూసికన్పడె, వెంట
     ఆహార సామగ్రి అంత తీరె

     కనుమరుగైపోవు ఘడియిదేయనుచు నే
     తలచుచున్నంతలో తెలిసె స్వామి:

     నిత్యనూత్నంబైన నీయిచ్ఛ నాలోన
     నిరతమటులె సాగు సరిత వోలె

ఆ. పదములన్ని యుడిగి వాక్కుమూగైపోవ
     గుండె లోన పొంగు కొత్త పాట
     సాగు పథము, చెరగి, ఆగిపోవగ, దారి,
     కొత్త దేశములను కూర్చునంచు!!!

Posted in August 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!