Menu Close
mg

చెప్పాలని ఉంది

ప్రేయసీ ప్రియుల మధ్యకానీ, ఆలుమగల మధ్యగానీ సరస శృంగారసన్నివేశం ఒక మరపురాని అనిర్వచనీయమైన అనుభూతి. అది ఎంత సున్నితమై, సంప్రదాయబద్ధంగా ఉంటె అంత ఆసక్తిని, ఉత్సాహాన్ని  ఇనుమడింప చేస్తుంది. 1967 సంవత్సరంలో విడుదల అయిన ఉమ్మడి కుటుంబం సినిమాలో మన నందమూరి నటసార్వభౌముడు కృష్ణకుమారి గారితో కలిసి నటించిన ఈ పాట ఎంత అందంగా, సున్నితమైన సరస సన్నివేశంతో ఎంతో హాయిగా ఉంది. మీరూ ఆలకించండి.

చిత్రం: ఉమ్మడి కుటుంబం
రచన: సినారె

సంగీతం: టి.వి. రాజు
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

చెప్పాలని ఉంది..
చెప్పాలని ఉంది..దేవతయే దిగివచ్చి
మనుషులలో కలసిన కథ చెప్పాలని ఉంది

చరణం 1:

పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్టి
మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కథ.. చెప్పాలని ఉంది

చరణం 2:

కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి
కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి
మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కథ.. చెప్పాలని ఉంది

చరణం 3:

అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో..
అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో..
ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలా తీరునో

నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే...
నీ చల్లని మదిలో అ దేవికింత చోటిస్తే..
ఆ లోకమె మరచి పోవు నీ లోనే నిలిచిపోవు
ఆ ..ఆ..ఆ..ఆ..ఆ

Posted in August 2020, పాటలు