Menu Close
Page Title
నారాయణ తీర్థుల తరంగ విన్యాసం
narayanatirtha
నారాయణ తీర్థులు
Picture Credit: Andhra Cultural Portal

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం
కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల- కృష్ణం కలయ సఖి సుందరం
నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల -కృష్ణం కలయ సఖి సుందరం
ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల -కృష్ణం కలయ సఖి సుందరం
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల -కృష్ణం కలయ సఖి సుందరం
రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల -కృష్ణం కలయ సఖి సుందరం
దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల-కృష్ణం కలయ సఖి సుందరం
రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా బాల -కృష్ణం కలయ సఖి సుందరం
అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల -కృష్ణం కలయ సఖి సుందరం”

మంగళంపల్లి వారు ఈ తరంగం పాడుతూంటే, ఆ శ్లోక గీతం వినే చెవులకు ఎంత ఇంపుగా వుంటుందో చూడండి. లింక్ »

క్లుప్తంగా భావము
కాంచుమా సఖీ కృష్ణడు ఎంత సుందరుడో!
ప్రపంచ వైభవానికి కారకుడై కూడా దానికి అతీతుడై ఉంటాడు, దేవతా విరోధులు అణచివేస్తూ ఉంటాడు, బాల కృష్ణుడు.
సత్య స్వరూపుడై, కాలాతీతుడై, కరుణామయుడై, భక్తులతో దేవమయ నృత్యంలో లీనమైయుండే బాలకృష్ణుని అందం చూడుడే!
ప్రాపంచిక భారజలధికి అతడు తీరం, సమస్తయోగులకు ఆధారం,
శృంగార రసభర సంగీత సాహిత్య గంగా లహరులకు అతడు సంగం,
నల్లని వాడు, జగదభిరాముడు, బలభద్ర దేవుడు, అందరికి ప్రియతముఁడు,…   ఈ విధంగా సాగిపోతుంది.

మన చిన్నప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు తాము ఆనందిస్తూ ఈ పాటలు మధురంగా పాడుకుంటూంటే వాటి అర్ధం అప్పుడు స్పష్టంగా తెలియకపోయినా (ఆ మాటకి వస్తే ఇప్పటికీ అదేస్థితి), ఆ సరళమైన పద గుంఫనమునకు, లాలిత్యానికి, ప్రాసల ప్రక్రియకి తన్మయాన్ని అనుభవిస్తూ, ఆనందించిన వాటిలో కొన్ని పాత పాటలు నారాయణ తీర్థులవారి తరంగాలని వాళ్ళు వివరించి చెబితే తప్ప అప్పుడు మనకు తెలియదు. పెద్ద అయ్యాక అవి వినిపించేవాళ్లు లేక, ఉన్నా మనకి అంతసులభంగా కొరుకుపడని సంస్కృతంలో ఉన్న గీతాల గురించి తెలుసుకోవాలన్న పిపాస కరువయ్యి గాని, కాలం కొరవడిన నెపంతో  గాని  ఆ ప్రయత్నానికి దగ్గరకు రానీయదు. నారాయణ తీర్థులు తెలుగువాడే అయినా, సంస్కృతంలో వ్రాసి అందరూ పాడుకునేటట్లుగా పన్నెండు తరంగాలలో వెనుక ఉండే ఆత్మ శ్రీకష్ణ పరమాత్ముడే! ఆయన చెరసాలలో జన్మించిన మొదలు రుక్మిణీ కళ్యాణం వరకు శ్రీ కృష్ణ లీలా గాథల గీత లహారులే. భగవానుని అవతారాలలో శ్రీ కృష్ణావతారం అత్యంత రసమయమై, వివిధ ఆకర్షణీయ ఇతివృత్తాలతో మనోహరంగా వికసించి ఆనందావధులని స్పృశింపచేస్తుందని మన కందరికి తెలుసు. నారాయణతీర్థుల తరంగాలు గీత లాలిత్యానికి, పదబంధానికి, భావపరిణతికి ప్రసిద్ధము.

ఈ ‘తరంగాల’ రస స్ఫూర్తి నాట్యాచార్యులచే బహుళ నాట్యరీతులలో మలచబడి, నాట్య విదుషీమణుల భావోత్ప్రేక్షకి, పాడేవారి సంగీత బాణిలో పొడగబడి, ప్రేక్షకుల భావావేశాలలో మధించబడి, అందరిని ఉన్నత లోకాలలో ఓలలాడించి కదుపుతుంది.

నారాయణ తీర్థుల పూర్వాశ్రమంలో ఆయన తలిదండ్రులొసగిన జన్మ నామం తల్లావఝుల గోవింద శాస్త్రి (క్రీ.శ 1650-1745). మంగళగిరి దగ్గర ‘కాజా’లో పుట్టి పెరిగి, సంస్కృతము లోను (పురాణాలు, శ్రీమద్భాగవతాలలో ఔపోసనం పట్టి), సంగీతంలో పాండిత్య ప్రకర్షని పొంది, నాట్యశాస్త్రాన్ని క్షుణ్ణంగా శోధించి సకల విద్యాపారంగతుడయ్యాడని పించుకుని, అంతటితో తృప్తిచెందక, కాశీ నగరానికి చేరి అక్కడి పండిత శ్రేష్ఠులతో కూడి చర్చించి, తన పాండిత్యాన్ని పెంచుకుంటూ వారికీ పంచాడట. చిన్నతనం నుండి పట్టుకుని పీడిస్తుండే 'పరిణామశూల' (విపరీతమైన కడుపులో నొప్పి)  పోగొట్టుకునేందుకు సింగరాయకొండ లోని నృసింహస్వామి ఆలయంలో 40 రోజులు ప్రదక్షిణం చేసి ఆ బాధపోగట్టుకుని అక్కడే 'తరంగ' రచన ప్రారంభించారట. ఒకరోజున అత్తవారిల్లు చేరుకునేందుకు ఉధృతం గా ప్రవహిస్తున్న కృష్ణ నది దాటబోతూ సుడిగుండంలో చిక్కుకుని ప్రాణరక్షణకోసం ఆపద్ధర్మ సన్యాసం పుచ్చుకుని, పిమ్మట భార్యానుమతితో  కంచీపురం చేరి అచ్చట శివరామ తీర్థుల వద్ద శాస్త్రోక్తంగా సన్యాసం పుచ్చుకుని దేశాటనం  చేస్తూ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి చివరికి కావేరి నదీ తీరానున్న ‘వరహురు’ లో స్థిరపడి అక్కడే దేహ విముక్తిని పొందాడట.

'శ్రీ కృష్ణ లీలాతరంగిణి' అనే నృత్య సంగీత రూపకావ్యాన్నిఅకుంఠిత కృష్ణ భక్తి తో కూర్చి, పాడి, అతడి ఆధ్వర్యంలోనే హావభావాలతో నాట్య ప్రదర్శన చేయించాడట. ఆ గ్రంధాన్ని పండ్రెండు ‘తరంగాలు’గా విభజించిన ఈ నాట్య కళారూపక మేలు కావ్య సంపుటి 34 రాగాలలోను, 9 తాళాలలోను, 17  వివిధ ఛందస్సులలోను 153  శ్లోక గీత 'తరంగాలు’ గా కూర్చి 31 'చూర్ణిక' లతో (సులభ శైలిలో లిఖించే వచన సంపుటిలు)  వాటిని నృత్య, నాట్య గీతాలలో వాడుకునే రీతిలో అనువుగా మలచి వాటికి ప్రాచుర్యాన్ని కలిగించాడు. ఇవే కాకుండా 15 పుస్తకాలు వాసి (వీటిలో కొన్ని కాశీ 'విశ్వవిద్యాలయ గ్రంధాలయం' లో ఉన్నాయి) ప్రతిభను చాటాడు. అతడు వ్రాసిన 'పారిజాతాపహరణం' తంజావూరు 'సరస్వతి మహల్ గ్రంధాలయం' లో అనేక పురాతన తాళపత్ర గ్రంధాలతో బాటు ఉన్నది.

ఆలోకయే శ్రీ బాల కృష్ణం

ఆయన శ్లోకగీతాల భాండారం నుంచి మరొక మేలి తునక: లింక్ »

ఆలోకయే శ్రీ బాల కృష్ణం సఖి
ఆనంద సుందర తాండవ కృష్ణమ్ ॥ఆలోకయే॥

చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణమ్ ॥ఆలోకయే॥

కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణమ్ ॥ఆలోకయే॥

సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
నంద నందనం అఖండ విభూతి కృష్ణమ్ ॥ఆలోకయే॥

కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణమ్ ॥ఆలోకయే॥

నవనీత ఖంఠ దధి చోర కృష్ణం
భక్త భవ పాశ బంధ మోచన కృష్ణమ్ ॥ఆలోకయే॥

నీల మేఘ శ్యామ సుందర కృష్ణం
నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణమ్ ॥ఆలోకయే॥

వంశీ నాద వినోద సుందర కృష్ణం
పరమహంస కుల శంసిత చరిత కృష్ణమ్ ॥ఆలోకయే॥

గోవత్స బృంద పాలక కృష్ణం
కృత గోపికా చాల ఖేలన కృష్ణమ్ ॥ఆలోకయే॥

నంద సునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణమ్ ॥ఆలోకయే॥

బాలా గోపాలా: (ఆకాశవాణి ప్రసారితము)

లింక్ »

పల్లవి
బాలా – గోపాల క్రిష్ణ పాహి

అనుపల్లవి
నీల మేగ సరిర – నిత్యనందం దేహి

చరణం 1
కలప సుందరాగ మన
కస్తూరి గొపిగానన
నళిన దళ వేగ నయన
నంద నందనా
వినుత గోప వసు జన
నీలంద గోపి మోహన
దలిత సంసర బందణ
దారుగ వై నాసనా
(బాల)

చరణం 2
విశ్వక్త పాదారవింద
విశ్వ వందిత ముకుందా
సత్య అకంద బోడనంద
సర్జిత నండా సునండా
సత్య స్తాబిత వేదానంద
పాలిత నండా గోవిందా
విశ్వత నారాయన థీర్త
నిర్మల ఆనంద గోవింద (బాలా)

గోవింద ఘటయ మమ ఆనంద మమృత మిహ

మరొక గీత శ్లోకం:

గోవింద ఘటయ మమ ఆనంద మమృత మిహ
గోవింద ఘటయ మమఆనంద మమృత మిహ
శ్రీనందతనయ బహుయోగీంద్రసురవినుత॥

చరణ (1):
అగణితగుణగ్రామఅపరిమితనిజకామ నిగమపరమారామనిఖిలమోహవిరామ
నగధర ఘనశ్యామనతజనకుముదసోమ అఘహరణ సర్వసమఅసురమండలభీమ॥

చరణ (2):
పరమపురుషాశేషపాల పరిజనతోష పరిహృతాఖిలదోషపతగవాహన శేష
పర్యంక మృదుభాషపరమమంగళవేష నిరవద్యగోపపురినియత వరమణిభూష॥

చరణ (3):
నవముక్తికాహారనందగోపకుమార భవబంధనవిదూరభద్రద సుఖాకార
అవనతజనాధారఅపరిమితశుభచార నవనీతచోర నరనారాయణావతార॥

చరణ(4):
శరదిందుసమవదనశతమన్మథసమాన గురుతరానందఘనకుందసుందరరదన
పరిపంథిగణదళనపాలితాఖిలభువన సరసనారాయణతీర్థసత్యఫలదాన॥

విమలహృదయకమలోదారంవివిధవిషయాకారం

విమలహృదయకమలోదారంవివిధవిషయాకారం

చరణ(1):
విమలహృదయకమలోదారంవివిధవిషయాకారం
కమనీయతరకరుణాసారం సర్వసమభావభావమహోదారమ్‌॥

చరణ (2):
సామాదినిగమాంతసంచారధీర ధీమదనుస్మృతగుణాకారం
సమరసమేకమనంతమనన్వయ మమితనిరంతరసుఖసాగరమ్‌॥

చరణ (3):
జగదండకోటిపరాకాశం సర్వ నిగమాంతవిదితస్వప్రకాశం
అగణితగుణమణివాగీశం దేవ మాగమరూపనిజాదేశమ్‌॥

చరణ (4):
విగళితమోహజభవపాశం విశ్వ మంగళకృతతనుమఖిలేశం
భగవంతమాదిగురుం శివమద్వయచిద్గగనం నవనీతాశమ్‌॥

చరణ (5):
సుందరతరమురళీవాదం ముని బృందవిచింత్య సుందరపాదం
నందతనయ మఖిలానందం శర దిందువదన మిహ గోవిందమ్‌॥

చరణ (6):
బృందావనహితగోబృందధృతమందర మఖిలనిగమకందం
నందసునందాదివంద్యమనన్యక నారాయణతీర్థయతివరదమ్‌॥

బ్రూహి ముకుం దేతిహేరసనే పాహి ముకుం దేతి

'మ్యూజిక్ అకాడమీ' వారి సంగీత అధ్యాపక చిత్రీకరణం: లింక్ »

మల్లాది సోదరులు పాడిన తరంగం: లింక్ »

కల్యాణి - ఆది

పల్లవి: బ్రూహి ముకుం దేతి హేరసనే పాహి ముకుం దేతి॥

చరణ (1): అక్రూరప్రియ చక్రధ రేతి హంసనిరంజన కంసహ రేతి॥

చరణ (2): రాధారమణ హరే రామేతి రాజీవాక్ష ఘనశ్యా మేతి॥

చరణ (3): కేశవ మాధవ గోవిం దేతి కృష్ణానంత సదానం దేతి॥

చరణ (4): అచ్యుత కృష్ణ హరే రామేతి హరినారాయణతీర్థప రేతి॥

శివ శివ భవ భవ శరణం మమ

మల్లాది సోదరుల గాత్ర సొరభం లో మరొక శ్లోక గీతం - లింక్ »

సౌరాష్ట్ర - ఆది

పల్లవి: శివ శివ భవ భవ శరణం మమ భవతు సదా తవ స్మరణమ్‌॥

చరణ (1): గంగాధర చంద్రచూడ జగ న్మంగళ సర్వలోకనీడ॥

చరణ (2): కైలాసాచలవాస శివ కర పురహర దరహాస॥

చరణ (3): భస్మోద్ధూళితదేహ శంభో పరమపురుష వృషవాహ॥

చరణ (4): పంచానన ఫణిహేష శివ పరమపురుష మునివేష॥

చరణ (5): ఆనందనటనవినోద సచ్చి దానంద విదళితఖేద॥

చరణ (6): నవవ్యాకరణస్వభావ శివ నారాయణతీర్థదేవ॥

సాహితీలోకం జయదేవుని 'గీతగోవిందం' తోను, లీలాశుకుని "శ్రీ కృష్ణ కర్ణామృతం' తోనూ సమాన స్థాయిలో ఈతని 'శ్రీకృష్ణలీలాతరంగిణి' ని కూడా పరిగణిస్తోంది. సాహిత్య, సంగీత, అభినయానుకూలంగా గీతోత్పత్తి చేసిన మొదటి సాహితీవేత్త నారాయణ తీర్థులు.

-o0o-

Posted in January 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!