ఆమె
దారం
అతనేమే
సూది
ఒకరినొకరు
అర్థం చేసుకున్నారు
కనుకే
వారి జీవితం
పూలమాలై
పరిమళిస్తుంది
ఆమె చీకటైనపుడు
అతను వెలుగవుతూ
అతను చీకటైనపుడు
ఆమె వెలుగవుతూ
అనుబంధానికి
ఆనందానికి
వేలాడే వంతెనై
కష్టసుఖాల
దాంపత్యానికి
భాష్యం చెబుతూ
భావితరాలకు
మార్గదర్శకాలుగా నిలిచే
అపురూప కదిలే శిల్పాలు వాళ్ళు
అతనేంటో
ఆమెకు
తెలుసు
ఆమేంటో
అతనికి
తెలుసు
వారివురి
మనస్తత్వమేంటో
ఇరుగుపొరుగు
చిలకలకు
తెలుసు
అతనో
జీవన
పుస్తకం
ఆమె
అందులో
సారాంశం
ఆమె
కన్నీరు
ఏరులై పారుతున్నది
మాటల కత్తులతో
మనసును
గాయపరిచి
ఏమి తెలియని
చిన్నపిల్లాడిలా
కౌగలించుకొని
ఆనందాన్ని పంచే
ఆతను
కనుమరుగై పోయాడని
ఎండిన మోడై
గోడు
వెళ్ళబోసుకుంటూ
కళ్ళొత్తుకుంటున్నదామె
తననుంచి
ఆకులా రాలిపోయిన
అతన్ని
తలుచుకుంటూ
ఆమె
కట్టెలు
కొట్టినప్పుడు
ఒళ్ళంతా
ముళ్ళు గుచ్చుకుని
రక్తం వచ్చిన
ఏడ్వలేదు గాని
అతడన్న
మాటలకు
ఏడుస్తున్నది
మనసుకు
గుచ్చాయి మరీ
అతను
నీటి బిందువై
విత్తనమైన
ఆమెను
చేరాడు
కనుకే
పచ్చని కాపురం
పరిమళిస్తున్నది
బావుంది అభి….అతను ఆమె ల్లో జీవన సారాన్ని నింపావు