అక్షర నీరాజనం
అనంతరాజు వారి అపురూప అమ్మాయిగా జనించి
తోబుట్టువులకు తోడుగా నిలిచి అనురాగవల్లిగా వర్ధిల్లుతూ
ఉమ్మడి కుటుంబ వితరణ సామర్ధ్యంతో
బుడమగుంట వారి జ్యేష్ట వధూటియై
పుట్టినింటి ఆచారాలు, మెట్టినింటి సంప్రదాయాలు
కలగలిపి సమయోచిత శైలిలో
అత్తమామల అనుంగు కోడలిగా
ఆడబడుచును ఆప్యాయతతో ఆదరించు వధూనికయై
మరుదులందరికీ మరో అమ్మగా అలరిస్తూ
బాధ్యతల బరువును అనునిత్యం
త్రికరణశుద్ధిగా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ
అన్ని తరాలకు ఆత్మీయురాలిగా మందస్మిత వదనంతో
ఆదరించే అన్నపూర్ణ గా సదా స్మరణీయురాలు గా
అయిదు దశాబ్దాలు అన్ని దశలలో
జీవన సాఫల్యాన్ని సిద్ధింపజేసి అలసిసొలసి
నింగికేగిననూ నిరంతరం నిత్యజ్యోతుల
నిరుపమాన శుభాశీస్సుల ఆవృష్టి
అందించే ద్రువతారయై వెలుగుతూ
అమ్మగానే నా స్మృతిపథంలో
నిలిచిన వదినమ్మా నీకిదే
పాదాభివందనం!! అక్షర నీరాజనం!!