Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

పంచాక్షరి పంచపదులు

పంచపదుల ప్రక్రియలో మరొక ఉప ప్రక్రియ ‘పంచాక్షరి పంచపది’.

పంచాక్షరి పంచపది నియమాలు:

  1. 5 పాదాలు ఉండాలి
  2. ప్రతి పాదములోనూ 5 అక్షరాలు మాత్రమే ఉండాలి
  3. ప్రతి పాదములోనూ అంత్య ప్రాస ఉండాలి.
  4. 5 వ పాదములో కవినామము కాకుండా 5 అక్షరాలు ఉండాలి.
  5. 5 వ పాదము కవి నామముతో ముగియాలి.

ఉదాహరణ : మే డే

1.
కర్షకులైన,
కార్మికులైన,
సైనికులైన,
బడుగులైన
శ్రమజీవులే సత్య!

2.
పనిగంటలు,
జీతభత్యాలు,
సౌకర్యములు,
పనిదినాలు,
సమమవ్వాలి సత్య!

3.
కులమతాలు,
జాతి భేదాలు,
బీదగొప్పలు,
తారతమ్యాలు,
ఉండరాదు సత్య!

4.
ఈర్ష్యాద్వేషాలు,
కోపతాపాలు,
దుష్టబుద్దులు,
చెడుస్నేహాలు,
విడనాడాలి సత్య!

5.
మంచివాడికి,
మంచి మాటకి,
మంచి పనికి,
మంచి బుద్ధికి,
మెప్పు తథ్యము సత్య!

6.
అతులితము,
అపురూపము,
ఆత్మ బంధము,
జన్మ బంధము,
పెళ్లి బంధము సత్య!

7.
నిష్కల్మషము,
అప్రమేయము,
ప్రేమమయము,
స్వార్థశూన్యము,
అమ్మ హృదయం సత్య!

8.
విలువైనది,
తూచలేనిది,
తీయనైనది,
తరగనిది,
అమ్మ ప్రేమయే సత్య!

9.
అమ్మానాన్నను,
గురువులను,
స్నేహితులను,
హితైషులను,
మరువవద్దు సత్య!

10.
జాతి యేదైనా,
భాష యేదైనా,
రంగు యేదైనా,
ప్రాంతమేదైనా,
మనమొక్కటే సత్య!

*** పంచపదుల ప్రక్రియ సమాప్తం ***

Posted in July 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!