అమ్మనుడి అనుగరి
అచ్చ తెలుగు తెరువరి
వాడుక తెలుగు వెలుగు
వేదికై నిలిచే గిడుగు
వైదిక వాసనలపై గురి
గ్రాంథిక భాషకు వికారి
అంద్రభాషను కడిగే
అచ్చ తెలుగు ను పొగిడే
సవర భాషకు కూర్పరి
పలు భాషల నేర్పరి
వాడుక నుడికి బాటసారి
జనుల భాషకు దారి చూపరి
గిడుగు అడుగులకు తోడు
కందుకూరి గురజాడ ల జోడు
వ్యవహార భాషకై పోరాటం
దేశీయ తెలుగు కై ఆరాటం
మన గిడుగు వారి బాట
కావాలి మనకు రాచబాట
అందుకే...
మనగిడుగు కు జేజేలు
వారికి తెలుగు మంగిడీలు
***** ***** *****
అందరికీ
తెలుగు నుడి నాడు వేడుక మేలి కోరికలు
భారతీయుని జన్మంబు భవ్య మవగ
తెలుగు వార మవగ జన్మ తేజమవగ
మాతృ భాష తెలుగవుట మనకు వరము
తెలుగునేల యందుమనుట దివ్య మగును
పుడమి తల్లిని వానలు తడిపినట్లు
పూలచెట్లకు తావిని పులిమినట్లు
తెలుగు మాటలు వినమేను పులకరించు
అమ్మపలుకునందు చిలుకు అమృత ధార
కమ్మనైన తెలుగు మన అమ్మ నుడి ర
***** ***** *****
మన తెలుగువారి దౌర్భాగ్యం
ఇన్ని ఏండ్లు అయిన సంస్కృత పదాలు వాడుతూనేవున్నం
మన అసలు తెలుగులో మాటలు వ్రాయలేకపోతున్నాం
అటు తమిళులను చూడండి. ప్రతి కొత్తమాటకు వారు తమ అమ్మనుడిలోనే మాట పుట్టిస్తున్నారు
తెలుగుభాషా దినోత్సవం...దీనికి తెలుగు లో రాయలేమా..ఒకసారి పూనిక చేయగలరు
తెలుగు నుడి పొద్దు వే డుక/అమ్మ నుడి నాడు వేడుక.. ఇలా రాస్తే ఎబ్బెట్టుగా వుంది కదూ...
అంతే పక్షి అంటే గొప్ప , పిట్ట అంటే చెత్త...
రాఘవ మాష్టారు గారు,చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు.