Menu Close
mg

పదహారేళ్ళకు.. నీలో... నాలో...

పదహారేళ్ళకు.. నీలో... నాలో...పడుచు ప్రాయంలో యువ హృదయాలలో ప్రేమ చిగురిస్తే ఆ ప్రేమలో ఎంతో స్వచ్ఛత, నిజాయితీ ఉండి ఆ టీన్ ఏజ్ లోని చిలిపి ప్రాయమైన ప్రేమ ఎంత మాధుర్యంగా మనసును పులకింపజేస్తుందో తెలుపుతూ ఆత్రేయగారి కలం నుండి జాలువారిన ఈ మధుర గానం మీ కోసం....

చిత్రం: మరో చరిత్ర (1978)
రచన: ఎం.ఎస్. విశ్వనాథన్

స్వరకల్పన: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. జానకి

పల్లవి:

పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియ బూసి... వెల్లువల్లే ఉరకలేసే
పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

చరణం 1:

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు..
పాటలు పాడిన చిరు గాలులకు...
తెరచాటొసగిన.. చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకూ...
కోటి దండాలు.. శతకోటి దండాలూ

చరణం 2:

నాతో కలిసి నడచిన... కాళ్ళకు
నిన్నే పిలిచే... నా పెదవులకు
నీకై చిక్కిన... నా నడుమునకూ...
కోటి దండాలు... శతకోటి దండాలూ

చరణం 3:

భ్రమలో లేపిన... తొలి జాములకు
సమయం కుదిరిన... సందె వేళలకు
నిన్నూ నన్ను... కన్న వాళ్ళకు
మనకై వేచే... ముందు నాళ్ళకూ
కోటి దండాలు.. శతకోటి దండాలూ

Posted in September 2019, పాటలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *