Menu Close
balyam_main

మన్మథా... నవ మన్మథా...

- డా. రావి రంగారావు

మనవడికి ముద్దులు

మనవడి నుదురు మీద

ఒక్క ముద్దు పెడతా,

బ్రహ్మదేవుడికి కృతజ్ఞతలు...

మనవడి కళ్ళ మీద

రెండు ముద్దులు పెడతా,

వాళ్ళమ్మ, నాన్నకు అభినందనలు,

మనవడి ముక్కు మీద

మూడు ముద్దులు పెడతా,

ముగ్గురమ్మలు అయ్యలతో కలిసి దీవించాలని...

మనవడి నోరు మీద

నాలుగు ముద్దులు పెడతా,

పురుషార్ధాలు సాధించాలని...

మనవడి బుగ్గ మీద

అయిదు ముద్దులు పెడతా,

పంచభూతాలు చక్కగా చూడాలని...

మనవడి గుండె మీద

ఆరు ముద్దులు పెడతా,

అరిషడ్వర్గాలు దూరం కావాలని...

మనవడి నాభి మీద

ఏడు ముద్దులు పెడతా,

సప్తర్షుల జ్ఞానం పొందాలని...

మనవడి పొట్ట మీద

ఎనిమిది ముద్దులు పెడతా,

అష్టైశ్వర్యాలు అందుకోవాలని...

మనవడి బెల్లం మీద

తొమ్మిది ముద్దులు పెడతా,

నవ రత్న పరిపూర్ణ మూర్తి కావాలని.

Posted in September 2019, బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *