తేనెలొలుకు
భారతీయుని జన్మంబు భవ్య మవగ
తెలుగు వార మవగ జన్మ తేజమవగ
మాతృ భాష తెలుగవుట మనకు వరము
తెలుగునేల యందుమనుట దివ్య మగును
పుడమి తల్లిని వానలు తడిపినట్లు
పూలచెట్లకు తావిని పులిమినట్లు
తెలుగు మాటలు వినమేను పులకరించు
అమ్మపలుకునందు చిలుకు అమృత ధార
కమ్మనైన తెలుగు మన అమ్మ నుడి ర
పద్దెము వ్రాసిన అర్థము గావలె..వేమన వలె
వాడుక తెలుగు పొందిక గావలె.. తెలగన్న వలె
కడన టీక ఎందుకు రాయ వలె..సంస్కృతం వలె
కందం:
పాడిక చెప్పిన వ్రాసిన
వేడుక గలిగి చదివినను వినినను మదిన్
పాడగ తెల్లము గావలె
వాడుక నుడి వేమన వలె పడుగురు మురియన్
పాడిక.....పద్యం,, తెల్లము... అర్థం
గ్రాంథిక భాషను వీడుతు
అందరికర్ధమగు జాను అచ్చ తెలుగునే
డెందము పొంగగ వాడుము
సుందర నుడుల తెలుగు జిగి సొబగులు మీరన్