Menu Close
Kadambam Page Title
పలకరింపు
యామిని కోళ్లూరు

ఉషోదయపు నులివెచ్చని కిరణాల వెలుగులు
కోడికూతలు పక్షుల కిలకిలరావాలు సుప్రభాతం
అలారంమోతతో స్నేహితుల సన్నిహితుల సందేశాలు
పల్లెల్లో పచ్చని పైరగాలుల అందమైన పలకరింపు

కూరగాయలు అమ్మే వారి పిలుపులో పలకరింపు
పనివాళ్ళు పాలుపోసేవారి ఆప్యాయ పలకరింపు
ఇంటి లోగిళ్ళలో వార్తాపత్రికలు వేస్తు పేపర్ అనే
ఆ వ్యక్తి అరుపు లో పలకరించే పలకరింపు

బోసిపాపాయిల ముసిముసి నవ్వుల పలకరింపు
స్వాగతం పలుకుతూ చెప్పే తియ్యని పలకరింపు
అమ్మమాట నాన్న పిలుపులో తేనెలూరు పలకరింపు
ఆత్మీయుల చుట్టాల రాకతో కలుపుగోల పలకరింపు

కవి కలంలో జాలువారే ప్రతి అక్షరం పలకరింపు
సినీసాహిత్యంలో పాటల మాటల పలకరింపు
బాలల సాహిత్యంలో వారి మనోభావాల పలకరింపు
సాహితి ప్రపంచం లో కొత్త కవుల తొలి పలకరింపు

వ్యక్తి గౌరవాన్ని పెంచుతూ శత్రువులని మిత్రులుగా
మార్చి కష్టాల్లోబాధల్లో ధైర్యాన్నిస్తూ మనసుకు
సంతోషాలని చేకూర్చే తొలకరి చిరుజల్లుల లాంటి
అధ్భుత దివ్యఔషధం మల్లెల సుగంధం పలకరింపు.

Posted in February 2022, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *