“ఓ మనసా”
ఓయీ! మూర్ఖపు మనసా!
నిన్ను నేవే మెచ్చుకొంటున్నావా!
నీలో నీవే మురిసిపోతున్నావా!
ఎంత పిచ్చిదానివి!
విధి చేసిన బొమ్మవి!
నీ వెంత?
నీ పరిధెంత?
నీ కలిమి, బలిమి
అంతా చంచలం!
ఆశల లంపటం!
పురిటినొప్పుల జననం
చితిమంటల మరణం
రెప్పపాటు జీవితం!
ఎప్పటికైనా బుద్భుదం!
అందుకే
బతికినంత కాలం
మనిషిగా జీవించు
బ్రతుకుల కోసం
ప్రేమలు పంచు
ప్రకృతిలా పరిమళించు!