January 2026 0 Comments సముద్ర భాష!! » నిద్ర చందలూరి నారాయణరావు ఎక్కడికి పోయింది నా నిద్ర?రహస్యంగా తన్నుకుపోయిందెవరు?తెలియకుండా గదిలోకొచ్చికళ్ళను మోసగించిందెవరు?ముఖంలోకి మొరటుగా చూసినఆ నల్లని భాష ఎవరిది?గంటకోసారి చప్పుళ్లతోజామును ఆక్రమించే గతమేమిటి?మెదడుపై ఆ గుర్తులెవరివి?చెవులకు వ్రేలాడుతున్న వింత వార్తలేమిటి?గుండె గోడల పక్కన తొంగి చూసేదెవరు?ఊపిరికడ్డంగా నిలబడిందెవరు?ఆకలిని చంపేసి, దప్పిక తీరనిఆ ఆలోచన రూపమెవరిది?రాత్రి రుచిని దూరం చేసిమనసును మోసం చేసేదెవరు ?రాత్రిని ఎంత వెదికినాకునుకు కనిపించక ఏమైపోయినట్లు?నన్ను లాక్కొచ్చి నా యెదుటముద్దాయిగా నిలబెట్టిన ప్రశ్నెవరిది?ఎక్కడికి పోయింది నా నిద్ర?నాపై ఈ కుట్ర ఎవరిదో? ఎందుకో? ******** 102 Posted in January 2026, కవితలు Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website