Menu Close
mg
Song

నాటు నాటు

పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలు. పల్లె ప్రజలు సహజమైన మాండలీక పదాలతో పాడుకునే పాటలే జానపదులుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. జానపదాలు సహజంగానే ఒక ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కనుకనే ఏ దేశంలోనైనా, ఏ భాషలోనైనా జానపదాలకు ఎంతో ఆదరణ ఉంటుంది. పాట విన్నంతనే ఎటువంటి వారికైననూ ఒక విధమైన ఉత్తేజాన్ని కలిగించే అతి గొప్ప గుణం ఈ జానపదాలకు సొంతం.

ఇక ప్రస్తుత విషయానికొస్తే, తెలుగు జానపద జావళి, ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రజ్వరిల్లింది. మన తెలుగు చలనచిత్రం “రౌద్రం రణం రుధిరం (RRR)” కొరకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోసు గారు వ్రాసి, కీరవాణి గారు స్వరకల్పన చేసిన ‘నాటు నాటు...’ పాటకు యావత్ ప్రపంచం పట్టం కట్టింది. ప్రపంచ వేదికలో ప్రముఖ పురస్కారమైన ‘ఆస్కార్’ ఈ పాటను వరించింది. మన తెలుగు భాషా సంస్కృతులను ప్రపంచానికి రుచిచూపింది. ఈ పాటను రూపకల్పన చేసి ఇద్దరు మేటి నాయకుల సంయుక్త నృత్యకేళిని చూపించిన ప్రతిభాశాలి శ్రీ రాజమౌళి గారు సదా అభినందనీయుడు.

RRR చిత్ర కథ వందేళ్ళ క్రితం నాటి సామాజిక అంశాలతో ముడిపడి ఉంది. కనుక నాటి పల్లె ప్రజల సామాజిక స్థితిగతులను వివరించే నాటుదనం, తెలుగుదనం తదితర ధర్మాలను ఈ పాటలో పొందుపరిచారు. అలాగే నాటి వేష భాషలను ప్రస్ఫుటించే విధంగా చిత్రీకరణ జరిగింది. ఈ గీతం కూడా అచ్చతెలుగు పదాల అల్లికతో ఎంతో హృద్యంగా అలరించింది. ఈ అచ్చ తెలుగు జానపద నృత్య గీతం "నాటు నాటు నాటు" పాటని ఇష్టపడని తెలుగువాడు ఉండడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేర్చేసుకోండి.

movie

RRR (2022)

music

చంద్రబోసు

music

కీరవాణి

microphone

రాహుల్ సిప్లిగంజ్, కార్తికేయ

పల్లవి:-
పొలంగట్టు దుమ్ములోన
పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో
పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకొని
కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన
కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన
మిరపతొక్కు కలిపినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు

చరణం1#
గుండెలదిరిపోయేలా
డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలాగ
కీసుపిట్ట కూసినట్టు
ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు
ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు…వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు…ఊర నాటు
నాటు నాటు నాటు…గడ్డపారలాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు…ఉక్కపోతలాగ తిక్క నాటు

చరణం 2#
భూమి దద్దరిల్లేలా
ఒంటిలోని రగతమంతా
రంకెలేసి ఎగిరేలా
ఏసేయ్ రో ఎకాఎకీ
నాటు నాటు నాటు…వాహా…ఏస్కో
అరె దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే
దూకెయ్ రో సరాసరి
నాటు నాటు నాటు

Posted in April 2023, పాటలు