Menu Close
కమ్మనైన తెలుగు నాటు పాట
(తేటగీతుల నతులు)
- రాఘవ మాష్టారు కేదారి -

వర తెలుగు మాట ఘనమైన ప్రతిభ పాట
దేశ దేశాల మన పాట తేజరిల్లి
నాటు నాటు ఘాటు పలుకు మేటి తెలుగు
తెలుగు హద్దులు చెరిపేను వెలుగు తోడ

మహిత తెలుగు పాట నిలిచె మహిన నోట
నాటు నాటు మేలిమి తెల్గు ఘాటు తెలిపె
చంద్రబోసుపాట తెలుగు చందమామ
కీరవాణి సంగీతమే క్షీర ధార

ప్రేమ రక్షితు నాట్యము వీర రసము
రాజమౌళి దర్శకుడిగా రంగులీని
గెలిచెనాస్కారు తెలుగింట వెలుగు లీని
వారి కివియే తెలుగుజాతి భవ్య నతులు

మాతృభాష తెలుగు మాట మరచిరిచట
ఆంగ్ల మనచునందరునిట నాశ మీర
తెలుగు హీన దీన మనచు తీర్పులిచ్చి
తిరుపెముగ తెలుగును జూడ దేశ దేశ

ములను తెలుగు ఘాటును చాటి ముచ్చటైన
నాటు పాట నాస్కారను మేటి మెచ్చ
నలను పొందెను గదరా మన తెలుగు సిని
మా చరిత మార్చె మనవారు మహితులవగ

ఎల్ల నాడులాస్కారును తొల్లి తెలుగు
పాటకిల దక్కేను ఘనత నాటినేటి
మేటి తెలుగునికనయినా సాటి చెప్పు
కమ్మనైన తెలుగు మన అమ్మను డిర

Posted in April 2023, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!