ముందుచూపు లేక...
ఏదో ఆశిస్తాం, ఎన్నిటికో శాసిస్తాం.
ఎందరినో దూషిస్తాం, అకారణంగా ద్వేషిస్తాం.
అర్ధరహితంగా వాదిస్తాం, విచక్షణారహితంగా వేధిస్తాం.
కోపాన్ని ఆవాహన చేస్తాం, సహనానికి ఉద్వాసన చెప్తాం.
పాపాన్ని మూటకట్టుకుంటాం, తాపాన్ని నెత్తిన పెట్టుకుంటాం.
వివేకాన్ని వెలివేస్తాం, విశ్రాంతిని బలిచేస్తాం.
ఎదుటివారికి దగ్గరయ్యేదారులు మూసివేసుకుంటాం,
ఒంటరితనానికి దారులను వెతికిపెట్టుకుంటాం.
ఏకాంతం కావాలని ఎదురుచూస్తాం,
ఏకాకి జీవితాన్ని ఇష్టపడతాం.
పోగొట్టుకున్నాక విలువతెలిసి పొర్లాడుతాం,
చేజార్చుకున్నాక చేవతెలిసి చెర్లాడతాం.
ముందుచూపు లేని మూర్ఖులమవుతాం,
అసలు చూపును వినియోగించుకోలేని అంధుల మౌతాం.