అవును ఇది నిజం
ఇది మానవాళి నైజం
నేను, నా సంపద, నావారు స్వార్థం
మేము, మనము, మన సమాజం సత్యం
ఇది నమ్మినవారికి ధర్మం
మది నమ్మని వారికి తర్కం
వ్యక్తి జీవుడు
సమాజం దేవుడు
దేవుడికే లేదు దిక్కు
ఇక జీవునికేది దిక్కు
జీవుడు బతికితేనే దేవుడు
దేవుడు ఉంటేనే జీవుడు
ఇరువురిది అనుబంధం
ఇద్దరిదీ అణుపరమాణువు బంధం
ప్రకృతిని వికృతి చేస్తే
సుకృతిని వికృతిని చేస్తే
ప్రకృతిని అదుపుజేయదలిస్తే
ప్రకృతిని అణచివేయదలిస్తే
జనులకి ఇదే గతి
ఫలితం అధోగతి
నాకేం అని – నేనే గొప్పని
మనిషి కాని పనులు చేస్తే
విర్రవీగి అహం జూపిస్తే
ప్రకృతి జేసింది గుర్రు
కరోనారూపంలో పెట్టింది కర్రు
నేడు ..
మనుషులు కాలుష్యాలు
మనసులు కాలుష్యాలు
మమతలు కాలుష్యాలు
పరిసరాలు కాలుష్యాలు
మానవజాతి కాలుష్య మయం
ప్రగతి అంతా అయోమయం
డబ్బు, దర్పం, పదవి మాదని
విద్య, వైద్యం, సేద్యం ఉందని
అహం జూపిన మానవాళికి
ఓ చిన్న క్రిమి కరోనా ధాటికి
దిమ్మ తిరిగి పోయింది
బొమ్మ గిర్రున కనిపించింది.
అందుకే...
ఓ మనిషీ!!
పకృతిపై పెత్తనం వద్దు
ప్రకృతితో కలిసి బ్రతుకుట ముద్దు
అందరం ఒకటిగా మనాలి
అందరికోసం ఒకరనాలి
ఒకరికోసం అందరనాలి
అదే సమ సమాజ నినాదం
కరోనా జేసిందది నిజం నిజం
కోట్లు కోట్లు డబ్బున్నా..
కోట్లమంది బలం ఉన్నా..
మనిషి మిత్తిని ఆపలేడు
ప్రకృతి శక్తిని దాటలేడు
అవును ఇది నిజం
ఇది ప్రకృతి నైజం
కరోనాను ఉమ్మడిగా తరమాలి
ఘన భారతావని ధర్మం గెలవాలి
వరదీపికలు నేడు వెలిగించాలి
బాగుంది.