Menu Close
Kadambam Page Title
కర్తవ్యం
-- జి రామమోహన నాయుడు

మనలోని అహంకారి కరోనా మమహ్మారి
బయటుంటె ఏమైందో చూడు
మనలోని సంస్కారి కరోనా మమహ్మారిని
తరిమేస్తే ఏమౌనో ఆలోచించు

మానవత్వం చాటండి, మరిచిపోక నడవు,
కుల మతాలు కాదండి, మనుషులంతా ఒక్కటండి,
ప్రాణం అందరిదీ, అందరికీ ఒకటేనండి
అని ఎలుగెత్తి చాటు

ఊహలన్ని పక్కనెట్టు,
తలపు గడియ ముందు బెట్టు,
ఇంట్లోనే ఉండు, ఇంట్లోనే తిను
దూరాన్ని పాటించు, ఆరోగ్య సౌభాగ్యాన్ని పెంచు
పరుగులన్నీ ఆపి పట్టు,
సమాజ సామూహిక ధర్మాన్ని పాటించు
కరోనాకు చెక్కుబెట్టు.

ప్రభుత్వ నిబంధనలను పాటిద్దాం
కలకాలం పిల్లా పాపలతో
సుఖసంతోషాలతో
కుటుంబ బంధాలకు మరోసారి
మంచి విలువలను ఆపాదిద్దాం.

Posted in May 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!