Menu Close
Geethanjali-page-title

8

THE child who is decked with prince's robes and who has jewelled chains round his neck loses all pleasure in his play; his dress hampers him at every step.

In fear that it may be frayed, or stained with dust he keeps himself from the world, and is afraid even to move.

Mother, it is no gain, thy bondage of finery, if it keep one shut off from the healthful dust of the earth, if it robs one of the right of entrance to the great fair of common human life.

సీ. రత్నభూషలు దాల్చు, రాకుమారు డెటుల
ఆటనాస్వాదించు నేటి వద్ద?

పరుగుపందెము లోన బంధించునే యవి!
తోటి వారిని గూడి ఆడునెటుల??

మహరాజు వేషమ్ము  మాసిపోవుననుచు
అడుగువేయ వెరచు నడుగడుగున !!

ఆరోగ్యమునొసగు అవనీ సుగంధమ్ము
నగల జుట్టితివమ్మ! న్యాయమేన!!!

ఆ. ప్రకృతి మాత యొడిని పరవశింపగనిమ్ము!
లోటు రాదు వాని ధీటు కేమి!!
మట్టిలోన బుట్టు మణులకట్టెదవేల?
ఆదమరచి వాని నాడనీక!!!

9

O FOOL, to try to carry thyself upon thy own shoulders! O beggar, to come to beg at thy own door! Leave all thy burdens on his hands who can bear all, and never look behind in regret.

Thy desire at once puts out the light from the lamp it touches with its breath. It is unholy - take not thy gifts through its unclean hands. Accept only what is offered by sacred love.

సీ. బరువు మోసెద వేల! తిరిపెమ్మునకిటుల
నీదు వాకిట నిల్చి నిన్ను నీవె!!

ఉన్మత్తుడవయి నీయునికి మరచిపోయి
లోనయున్న ప్రభుని కాన వేమి!

సంశయమ్మును వీడి సర్వమ్ము భరియించు
ప్రభునిపై  భారమ్ము వదలు!! / నీదు,

ఉచ్ఛ్వాసమును సోకి‌‌ ఉల్లమందున జ్యోతి,
మలగిపోవును కోర్కె మలినమైన!

ఆ. కలుష‌ మనము జేయు, కానుకల విషము,
తీసికొనకు వాని తెలిసి తెలిసి!
హృదయమందు ప్రేమ మధురామృతము జేయు
ఫలము చిన్న దైన బడయుమోయి!!

10

HERE is thy footstool and there rest thy feet where live the poorest, and lowliest, and lost.

When I try to bow to thee, my obeisance cannot reach down to the depth where thy feet rest among the poorest, and lowliest, and lost.

Pride can never approach to where thou walkest in the clothes of the humble among the poorest, and lowliest, and lost.

My heart can never find its way to where thou keepest company with the companionless among the poorest, the lowliest, and the lost.

సీ. నీపాద పీఠమ్ము నిరతమ్ము విలసిల్లు,
నిరుపేద ప్రజలదౌ నిలయమందు!!

మలినాంబరములతో బలహీనుల నడుమ,
వసియింతువు నీవు వారి వలెనె!!

సాష్టాంగముల జేతు సముఖమ్మున ప్రభూ!
అందుకోగలనంచు అంఘ్రియుగము!

"ఆడంబరము యెప్పు డచటనిలువగలే"
దనెడి సత్యమునెన్న, నంధురీతి!!

ఆ. గర్వమతిశయించు కఠినాత్ముడను నేను,
దీన హీన జనుల రేని వీవు!
వదలనైతి నేను హృదయ మాలిన్యము,
చేరుటెటుల స్వామి కోరి నిన్ను!!!

11

LEAVE this chanting and singing and telling of beads! Whom dost thou worship in this
lonely dark corner of a temple with doors all shut? Open thine eyes and see thy God is not before thee! He is there where the tiller is tilling the hard ground and where the path-maker is breaking stones. He is with them in sun and in shower, and his garment is covered with dust.

Put off thy holy mantle and even like him come down on the dusty soil!

Deliverance? Where is this deliverance to be found? Our master himself has joyfully taken upon him the bonds of creation; he is bound with us all for ever.

Come out of thy meditations and leave aside thy flowers and incense!
What harm is there if thy clothes become tattered and stained? Meet him and stand by him in toil and in sweat of thy brow.

సీ. అంధకారము నిండు ఆలయమ్మును మూసి,
జరుపుటేలా నీవు జపతపముల!!

కనులు తెరచి గాంచు!! గండశిలలు దొల్చు
కర్షకాళిని గూడి కలడు స్వామి!!

ఎదుటయున్న ప్రభుని వెదికేవు కనుమూసి
మోకరిల్లెదవీవు మోక్షమడిగి!!

సృష్టికార్యముజేయ ఇష్టపడుచు స్వామి
బంధనమ్ముల తానె బడెను కాద!

ఆ. ముక్తి కొరకు నీదు రిక్త పూజలు మాని
కష్ట పడగదోయి కండలరుగ
ఘర్మజలము చిందు కనుబొమ్మల నడుమ
అపుడు కాంచ గలవు అఖిలప్రభుని!!

12

THE time that my journey takes is long and the way of it long. I came out on the chariot of the first gleam of light, and pursued my voyage through the wildernesses of worlds leaving my track on many a star and planet.

It is the most distant course that comes nearest to thyself, and that training is the most intricate which leads to the utter simplicity of a tune.

The traveller has to knock at every alien door to come to his own, and one has to wander through all the outer worlds to reach the innermost shrine at the end.

My eyes strayed far and wide before I shut them and said "Here art thou!" The question and the cry "Oh, where?" melt into tears of a thousand streams and deluge the world with the flood of the assurance "I am!"

సీ. తొలివెల్గు రథముపై అలుపెరుగని యాత్ర
చేయుచుంటిని నేను రేయిపవలు

గగనాల భ్రమియించి గ్రహతారకలపై
అడుగుజాడలువైచి కడచి పోదు

ప్రభునిజేర్చెడి త్రోవ బహుదూరమైతోచు
చేరువగా చేయు చివరకదియె

పరదేశమున, తట్టు, పాంథుండు ప్రతియిల్లు
తనగేహమును జేరు మునుపు! అటులె,

ఆ. తిరుగ వలెనతండు ధరనంతయు, హృదయ
మందిరమున ప్రభుని పొందువరకు!!!

కణకణమున యతని యునికినాస్వాదించి
కరగి పోయి స్వామి కరుణలోన,

ఆ. కలయ జూచి అపుడు కన్నీటి ధారలన్
"ఎచట యుంటి వయ్య యిన్ని నాళ్ళు"
అనెడి నా పిలుపున కాశ్వాసముగ, నిల్చె
"నేను" అనుచు వాక్కు నిశ్చయముగ.

Posted in May 2020, సాహిత్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!