Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౮౪౧. ఉల్లిని, తల్లిని నమ్మి చెడినవారు లేరు.

౮౪౨. ఉల్లి, మల్లీ కాలేదు; కాకి, కోకిలా కాలేదు.

౮౪౩. ఊరుకున్నంత ఉత్తమం మరేదీ లేదు.

౮౪౪. ఊరుకున్న వాడిని ఊరేమీ అనలేదు.

౮౪౫. ఊరకే పెట్టినమ్మా, నీ మొగుడితో సమానంగా పెట్టలేదేమే - - అని అడిగినట్లు ...

౮౪౬. ఊరు మెచ్చాలంటే, ఊరిలో పెద్దరికమైనా ఉండాలి లేదా, ఊరి చివర పొలమైనా ఉండాలి ...

౮౪౭. ఊహలు ఊళ్లేలుతూంటే, కర్మ కట్టెలు కొట్టిస్తోంది.

౮౪౮. ఊరికే ఉండలేక ఉరేసుకున్నాడుట!

౮౪౯. ఋణ శేషం, వ్రణ శేషం, శతృ శేషం, అగ్ని శేషం ఉండరాదు.

౮౫౦. ఎంగిలికి ఎగ్గులేదు, తాగుబోతుకి సిగ్గులేదు.

౮౫౧. ఎండ వల్ల వచ్చింది నీడకి గౌరవం.

౮౫౨. ఎండిన ఊళ్ళ గోడు ఎవరికీ పట్టదుగాని, పండిన ఊళ్లకు మాత్రం అందరూ ప్రభువులే.

౮౫౩. ఎంత పండినా అంతా కూటికే, ఎంత ఉండినా చివరకు కాటికే.

౮౫౪. ఎంత వారైనా కాంత దాసులే...

౮౫౫. ఎక్కడైనా బావగాని వంగ తోటలో కాదు...

౮౫౬. ఎక్కడ మేసి వచ్చినా మనావు మనింటికీ వచ్చి పాలిస్తే చాలు...

౮౫౭. ఎవడిచ్చాడురా నీకీ పెత్తనం - అని అడిగితే; మూలను పడి ఉంటే తీసి నేనే నెత్తిన వేసుకున్నా - అన్నాడుట!

౮౫౮. ఎక్కడెక్కడి నీరూ పల్లానికే చేరుకుంటుంది.

౮౫౯. ఎత్తువారు ఉంటే చాలు, ఏకులబుట్ట కూడా బరువే ఔతుంది.

౮౬౦. ఎముక లేని నాలుక ఎన్ని వంకరలైనా పలుకుతుంది.

౮౬౧. ఎరువు సొమ్ము బరువు చేటు, తియ్యా పెట్టా తీపుల చేటు, అవి పోయాయంటే అప్పులచేటు.

౮౬౨. ఎద్దు ఏడాదిలో నేరుస్తుంది ; మొద్దుకి ముఫ్ఫై ఏళ్ళు గడిచినా ఏమీ చేతకాదు.

౮౬౩. ఎరువు సరైనదయితే ఎవడైనా సేద్యగాడే...

౮౬౪. ఎలుక ఏడుపు వింటే, పిల్లికి జాలి కలుగుతుందా?

౮౬౫. ఎవరి పిచ్చి వారికి ఆనందం.

౮౬౬. ఎవరి పాపాన వారే పోతారు.

౮౬౭. ఎవరి బిడ్డ వారికి ముద్దు.

౮౬౮. ఎవరి ఏడుపు వారికే చేటు.

౮౬౯. ఏ కర్రకి నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది.

౮౭౦. ఏ కాలు బెసికినా క్రింద పడడం ఖాయం.

Posted in May 2020, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!