చెలీ.. ఓ చెలీ..నా నెచ్చెలి
ఎవరివో..నా కలల జాబిలి
కలలోని కమనీయ దృశ్యానివా!
ఎదలోని రమణీయ భావానివా!
నవ ప్రకృతి సొగసుల బాలవా
భవ సుకృతి రసాల బేలవా
మధుర పుప్పొడి మకరంధానివా
మధు వెన్నెల మందహాసానివా
సుందరా ప్సరాంగన అందానివా
మందారాధరామృత బిందువా
చెలీ నా చెలీ నీవెవరవు
సఖీ నా సుఖీ నీవెవరవు
కలలోని ముదితవా తెలుపవే
కతలోని చరితవా నుడువవే
నదిలో జలజల సాగే పాటవో
ఎదలో గుసగుసలాడే మాటవో
తుషారవీచికావెన్నెల జల్లువో
ప్రత్యూష బాలకిరణ మణి రేఖవో
ప్రణయతమసునందుదయించు శశిరేఖవో
విరహ వినీలాకాసాన చెలి రాకవో
చెలీ నాచెలీ నీవెవరు
నా కలల రాణి నీవెవరు
కలలోని కల్పనవా ఎవరివే
కనలేని భావనవా ఎవరివే
చెలీ నా గుండెలో వాడని పూల పరిమళమా
సఖీ నా మిత్తిలో వీడని ప్రేమ భామినివా
అయితే గియితే నా ఊహాల కవితవు
ఇహపరముల కందని కావ్యపు మెలతవు
ఆలోచిస్తే సగటు జీవికి దక్కని ముక్తి కాంతవు
ఆవేశి స్తే నేటి కవులకు చిక్కిన రక్తి భ్రాంతివి.
అంతేలే...అంతేలే... వింతేలే.. వింతేలే..