ఔను నేను దొంగనయ్యా
గుళ్ళో లింగాన్ని గుండెల్లో దాచుకున్నాను
గుడి నీదే...గుండే నీదే...
నేను దొంగెట్ల అయితినయ్యా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కూలీవాడు బరువులను మోసే కూలీ
ఆత్మ దేహాల్ని మోసే కూలీ
పరమాత్మ ఆత్మలను మోసే కూలీ
పాపం సదాశివా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది
నీ కంటే పెద్దకూలీ లేడు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
జటాజూటం ఏమిటి
అందులో గంగేమిటి
స్వర్గ భూతల పాతాళ ప్రయాణమేమిటి
అదముడైనా నాకు అర్థమవుటలేదయ్యా
అనుగ్రహించి చెప్పరావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చంద్రుడు ఏమిటి
చేయరాని పనులు చేయుటేమిటి
నిన్ను పూజించుటేమిటి
నీ నెత్తికెక్కుటేమిటి
అదముడైనా నాకు అర్థమవుటలేదయ్యా
అనుగ్రహించి చెప్పరావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
పాము ఏమిటి
నీ మెడలో ఉండుటేమిటి
ఆ పామే మంథర పర్వతానికి తాడవుటేమిటి
అదముడైనా నాకు అర్థమవుటలేదయ్యా
అనుగ్రహించి చెప్పరావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
హాలహలమేమిటి
అందరూ పరుగెత్తుటేమిటి
నువ్వే... దాన్ని పట్టి తేనీరులా త్రాగడమేమిటి
అదముడైనా నాకు అర్థమవుటలేదయ్యా
అనుగ్రహించి చెప్పరావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
తోలు బట్టేమిటి
అది అసురుడిది కావడమేమిటి
ఆ అసురుడి గుండెలో నువ్వు ఉండడమేమిటి
వాడి తోలును బట్టగా కట్టడమేమిటి
అదముడైనా నాకు అర్థమవుటలేదయ్యా
అనుగ్రహించి చెప్పరావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మూడో కన్నేమిటి
అందులో నిప్పులేమిటి
మన్మథుడిని కాల్చడం ఏమిటి
కామము గెలవడమేమిటి
అదముడైనా నాకు అర్థమవుటలేదయ్యా
అనుగ్రహించి చెప్పరావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
అర్ధభాగం అర్ధాంగికి ఇవ్వడమేమిటి
ఆ అర్ధాంగి యముడిని తన్నడమేమిటి
ఆ నింద నీకు రావడమేమిటి
అదముడైనా నాకు అర్థమవుటలేదయ్యా
అనుగ్రహించి చెప్పరావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నువ్వేమిటి....
భూదిరాయడమేమిటి
నువ్వేమిటి....
కాట్లో ఉండడమేమిటి
నువ్వేమిటి....
భిక్షమెత్తడమేమిటి
అదముడైనా నాకు అర్థమవుటలేదయ్యా
అనుగ్రహించి చెప్పరావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...