Menu Close
mg
Song

బతుకమ్మ బతుకమ్మ

తెలంగాణ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ ‘బతుకమ్మ’. ప్రతియేటా ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటారు. దసరా సమయంలోనే వచ్చే ఈ సంప్రదాయబద్ద పండుగకు విశిష్ట ప్రాచుర్యం ఉంది. బతుకమ్మ పండుగను గౌరి పండుగ అని లేదా సద్దుల పండుగ అని కూడా అంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పండుగ ప్రాశస్తాన్ని వివరిస్తూ ఎన్నో జానపద పాటలు ఉన్నాయి. జనపదాలను కూర్చి వ్రాసిన పాటలు కనుకనే ప్రతి ఇంటి లోగిలిలో ఆ పాటలు మనకు వినపడుతున్నాయి. బతుకమ్మ సాక్షాత్తు అమ్మవారి దేవతా రూపం కనుక తొమ్మిదిరోజులు ఆమెను పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని ఇంటిల్లిపాది పొంది అందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని అందరూ కోరుకుంటూ ఈ పండుగను ఎంతో నిష్ఠతో జరుపుకొంటారు.

2008 లో వచ్చిన బతుకమ్మ చిత్రం నుండి ఈ క్రింది పాటను మీకోసం అందిస్తున్నాం.

movie

బతుకమ్మ (2008)

music

గోరేటి వెంకన్న

music

టి. ప్రభాకర్

microphone

శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం

బతుకమ్మ బతుకమ్మ… మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ… మా తల్లీ బతుకమ్మ

తంగెల్లో దొరికిన తల్లీ… మా తల్లీ బతుకమ్మ
ఏ తల్లి కన్నదో నిన్ను… మా తల్లీ బతుకమ్మ
నింగీ నెలవంక వోలే… కడిగీన ముత్యమోలే
కనువిందు చేసినావే… మా పల్లె దీపం నీవే

బతుకమ్మ బతుకమ్మ… మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ… మా తల్లీ బతుకమ్మ

స్వామి కోనేటి నీరే…
నీ తానానికి పన్నీరే
వీసే సిరు గాలి గంధం
నీ మోముకు దిద్దేనందం

నిను చూసి పత్తి మురిసే
నీకోసం పొత్తిలి పరిసే
సిలకమ్మా జోల పాడే
సిన్నారి నిద్దురపోవే

వాలుగొమ్మన ఉయ్యాల
ఊగాలి నువు జంపాలా
నీ బోసినవ్వులతోనే
మా ఆశలు వికసించాలా
నీ పాదం మోపిన నేల
సిగురించి సిందెయ్యాల

బతుకమ్మ బతుకమ్మ… మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ… మా తల్లీ బతుకమ్మ
సేమంతి పూసినట్టు… సెలయేరు నవ్వినట్టు
పొదనుండి దూకీ జింక… పొద్దు వైపురికీనట్టు

వడివడి నీ అడుగుల ఎంట
ఊరంతా నడిసేనంట
ఊటా బావీ మోట
నీ పాటకు దరువుల మోత

ఊగేటి సద్దా సేను
నీ మాటకు తలలూపంట
అలమంద ఆ గో ధూళి
నీ పాదాలకు పారాణి
మా ఆశల ప్రతిరుపానివి
బతుకమ్మా నువు మా రాణి

బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ

బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
మా తల్లీ బతుకమ్మ

తంగెల్లో దొరికిన తల్లీ… మా తల్లీ బతుకమ్మ
ఏ తల్లి కన్నదో నిన్ను… మా తల్లీ బతుకమ్మ
నింగీ నెలవంక వోలే… కడిగీన ముత్యమోలే
కనువిందు చేసినావే… మా పల్లె దీపం నీవే
బతుకమ్మ బతుకమ్మ… మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ… మా తల్లీ బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ… మా తల్లీ బతుకమ్మ

Posted in October 2022, పాటలు