Menu Close
mg

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

ప్రేయసీ ప్రియుల మధ్య గాని, భార్యా భర్తల మధ్య గానీ స్వచ్ఛమై, పారదర్శకంగా ప్రేమ జనించినప్పుడు అది దిగ్విజయంగా కలకాలం నిలుస్తుంది. అయితే ఆ సునిశితమైన ప్రేమ హద్దులు దాటకుండా, విపరీత పోకడలకు పోకుండా ఉంచాల్సిన బాధ్యత దానిని కలిసి పంచుకుంటున్న ఆ రెండు మనసులదే. అటువంటి ప్రేమపూరిత సరస సంభాషణలను పాట రూపంలో ప్రదర్శిస్తే ఇటువంటి మధురమైన పాట ఒకటి జనిస్తుంది. వేటూరి గారి కలంలో పురుడుపోసుకొని, ఇళయరాజా గారి స్వరఝరుల సమ్మేళనంతో, గానగంధర్వుడు మరియు స్వరమాధురి, జానకి గార్ల గాత్రంలో అభిలాష చిత్రం కోసం విరిసిన ఈ అపురూప విరుల ప్రేమ గీతం వినండి మరి.

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే
గాలీవానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే
విసిరే కొసచూపే ముసురై పోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తలదాచుకో
తాపాలలో ఉన్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

తారత్తా తరతత్ తరతా తారత్తా తరతత్ తరరా
పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

Posted in December 2021, పాటలు