Menu Close
తేనెలొలుకు
(ఆలాపన కవితా సంపుటి)
- రాఘవ మాష్టారు
7. “జీవన పాత్ర”

అంతా ఆనందమే
అనుకున్నా నీ జీవితం

అన్నీ ఒడిదుడుకులే
ఆరంభం అంతం అనంతాలే
నీ ఆనందం నీది ...ప్రభో

నన్నొక కళాపిపాసిగ జేసి
రిక్త హస్తాల జీవన పాత్రనేసి
నీ వెంట కొండ కోనల్లో
నీ రెండ గాలి వానల్లో
పిచ్చివానిలా త్రిప్పుకుంటావు
ఉల్లాసంతో నవ్వుకుంటావు

నవ జీవనామృతం కోసం
నీ అమృత హస్తాల స్పర్స కోసం
నా చిన్ని గుండెతో
అంతం లేని కోర్కెలతో
అంతులేని నీ కాన్కల్ని
ఈ చిన్ని దోసిలితో తీసుకొంటాను
నా జీవన పాత్రను నింపుకుంటాను

కాల చక్రంలో
మళ్ళీ మళ్ళీ..
రిక్త పాత్రతో
నీ వెంట పిచ్చివానిలా...

***సశేషం***

Posted in December 2021, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!