Menu Close
Kadambam Page Title

బెల్లం ఆవకాయ

- అయ్యగారి రాజేశ్వరి

ఆప్యాయత అనే ఆవపిండిలో
అనురాగం అనే పప్పునూనె పోసి
మమత అనే మామిడికాయల ముక్కలను వేసి
ఉల్లాసం, మమకారం అనే ఉప్పు, కారం కలిపి, అందులో
తల్లిలా మేలు చేసే వెల్లుల్లి వేసి
మధురమైన మాటలవంటి బెల్లం కలిపి
అభిమానం వంటి శెనగలు,
బంధంలాంటి మెంతులు వేసి
కనుల కింపైన కెంపురంగులో తయారుచేసిందే
కమ్మగా ఉండి, అమ్మను తలపించి
నాలుక నాడించి, నో రూరించి
మమ్మానందింప జేసింది......
అదే తెలుగువారి ఊరగాయసామ్రాజ్యంలో రుచి అనే పరగణాకి రాణి
బెల్లం ఆవకాయ

Posted in February 2020, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *