Menu Close
Kadambam Page Title
విక్రమ సింహపురి
సౌందర్య కావటూరు

సింహపురి మా ఊరు
రాజకీయ సింహాలకిది జాగీరు
మొలగొలకులకు పెట్టింది పేరు
నెల్లూరు అసలు పేరు నెల్లి ఊరు
ఇట తిక్కన తెనిగించెను మహాభారతం
మనుమసిద్ధి పాలించిన ఘన చరితం

శేష తల్ప శయనుడయి రంగనాధుడు
ఇటు కోరిన వరములిచ్చు కామాక్షితాయి
అటు వేడిన వెతలు తీర్చు నరసింహస్వామి
మూలాపేట శివాలయం ముక్కంటి అభయహస్తం

బిరా బిరా పెన్నమ్మ దూకుడు
ప్రకృతి కన్య పరచిందిట జలతారు చేలం
పర్యాటకులకిది సుందర బృ౦దావనం

నడిబొడ్డున గాంధీ విగ్రహం
చెప్పకనే చెపుతాయి నెల్లూరీయుల భక్తి
ప్రస్ఫుటమగు రాజకీయ అనురక్తి
సంజె వేళ సాగర సమీర స్పర్శనం
మండే సూర్య తాపానికి శీతల గంధం
చవులూరు రుచులకు కోమల విలాస్
ఇట కంది, మినుము పచ్చడుల సౌరభాలు
గుబాళిస్థాయి దశదిశాంతాలు

నాణ్యమైన నగిషీ నగలకు కేరాఫ్ అడ్రస్
గణింప మేటి సినిమా హాళ్ళకూ ఫేమస్ ప్లేస్
పొట్టి శ్రీ రాములు పోరాట పటిమ కు నెలవు
పుచ్చలపల్లి సామ్యవాద గరిమను కన్న తావు

అన్నింటిని మించి
నెల్లూరు నేరజాణలు అన్నింటా మేటి
లేదు మరో ఊరు నెల్లూరు పట్టణానికి సాటి

Posted in September 2022, కవితలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *