౪౪౧. తెలివి తక్కువ, ఆక లెక్కువ ...
౪౪౨. సూది బెజ్జమంత నోరు, ఆకాశమంత ఆకలి!
౪౪౩. పొట్టివాడికి పొట్టనిండా బుద్ధులే!
౪౪౪. కానిరోజులోస్తే కర్రే పామై కరుస్తుంది.
౪౪౫. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు.
౪౪౬. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి.
౪౪౭. ఇంటిని చూస్తే ఇల్లాల్ని చూసినట్లే.
౪౪౮. లోతు తెలుసుకుని మరీ నీటిలో దిగాలి.
౪౪౯. అన్నీ కలవాడు అందలం ఎక్కితే, సాటికోసం సరప్ప చెరువుగట్టు ఎక్కాడుట!
౪౫౦. ఊరంతా ఉన్నవన్నీ ఎండేసుకుంటే, ఎలక తన తోక ఎండేసుకుందిట!
౪౫౧. బిడ్డలతల్లి బిడ్డకు పాలిచ్చి వచ్చేసరికి గొడ్రాలు గోనెడు వడ్లు దంచిందిట!
౪౫౨. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగర గలనందిట!
౪౫౩. అయ్యవారూ! ఏమి చేస్తున్నారు - అంటే, చేసిన అవకతవకల్ని సరిదిద్దుకుంటున్నాను - అన్నారుట!
౪౫౪. కురూపీ, కురూపీ! నీ పనేమిటిరా - అని అడిగితే, సురూపాలకి వంకలు పెట్టడమే నా పని – అన్నాడట!
౪౫౫. నలుపు నాలుగు వంకల్ని తెస్తుంది, ఎరుపు ఏడు వంకల్ని దాస్తుంది.
౪౫౬. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు...
౪౫౭. పుణ్యానికి పుట్టెడు వడ్లు కొలుస్తా రమ్మంటే, "కుంచం పిచ్చకుంచం కాదుకదా" అని అడిగాడుట !
౪౫౮. విద్య లేనివాడు వింత పశువు ...
౪౫౮. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా !
౪౫౯. గుడిలో లింగాన్ని మింగేసేవాడు ఒకడైతే, గుడినీ, గుడిలోని లింగాన్నీ మొత్తం మింగేసే వాడు ఇంకొకడుట!
౪౬౦. తాడిని తన్నెడివాడు ఒకడైతే, వాడి తలమీధ తన్నేవాడు ఇంకొకడు...
౪౬౧. మొగుణ్ణి కొట్టి, మొగసాలకు మొర పెట్టిందిట!
౪౬౩. పెట్టినమ్మకు పుట్టిందే సాక్షి ...
౪౬౩. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం....
౪౬౪. పులినిచూసి నక్క వాతలు పెట్టుకుందిట!
౪౬౫. గతిలేనమ్మకి మతిలేని మొగుడు.
౪౬౬. గతి లేనప్పుడు గంజే పానకమౌతుంది.
౪౬౭. ఎంత ఏనుగైనా ఏదో ఒక సమయంలో కాలు బెసక్కపొదు.
౪౬౮. తాతకా దగ్గులు నేర్పడం !
౪౬౯. పాము చిన్నదైనా, కర్ర పెద్దది ఉండాలి.
౪౭౦. కుక్కని సింహాసనం ఎక్కించినా, దాని దృష్టి చెప్పుల మీదే!