Menu Close
prabharavi

బూటు కాళ్ళతో వస్తున్నాడు

కుర్చీ మీదెక్కటానికి!

చీమల్లారా,

జాగ్రత్త!

 

ఒక్క ఓటుతో వాజపేయి

నిలిపాడు నోటు పరువు,

ఒక్క నోటుకోసం కొందరు

ఓటుకు బరువు!

 

తెల్ల సొన

"వైట్ మనీ",

పచ్చ సొన

"బ్లాక్ మనీ"

 

ఎంత దాగినా

చీల్చి బయటకు లాగి

తలకాయ పగలగొడతారు

అయ్యో- కొబ్బరి కాయ!

 

చావుకు

తెగించి వుంటారు

దేశంకోసం సైనికుడు,

ప్రేయసికోసం ప్రేమికుడు.

విశ్వం కొమ్మను

నమ్మకాలతో పట్టుకొని

వేలాడగలుగుతున్నారు

మనుషులు!

 

పగిలిన తల ముక్కలతో

కొబ్బరికాయ నవ్వుకుంటోంది

గుండెలో చీకట్లతో మనం

దేవుళ్ళను అడుక్కుంటుంటే!

 

కాంట్రాక్టరుగారు

ఖాళీగా ఉన్నారు,

అధికార పార్టీలో

లేరు గదా!

 

సప్త వర్ణ కిరణంగా

మనసు మారాలి,

సప్త వ్యసనాల

చీకట్లు పోవాలి.

 

ఓటు సుందరికి

వల వేస్తున్నారు,

నీ ఓటు

శీలం జాగ్రత్త!

Posted in April 2019, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *