4. మీ పాట నా పంచపది:
ఇక్కడ ఒకరు ఒక పాట పల్లవి లోని 5 పదములు ఇస్తే, పాటలోని ఒక్కొక్క పదమును వేరు వేరు పాదములలో ఉపయోగించి మనము పంచపది వ్రాసి తిరిగి మనం ఒక పాట పల్లవి లోని 5 పదములు ఇవ్వాలి......ఇలా కొన సాగుతుంది ప్రక్రియ. ఇందులో ఒక సమయ నియమం పెట్టుకోవచ్చును.
కొన్ని ఉదాహరణలు చూద్దామా......
1: పాడుతా తీయగ చల్లగా, పసిపాపలా నిదురపో తల్లిగా ......: ఇచ్చిన పాట
కన్నతల్లి తీయగా జోల పాట పాడగా,
పసిపాప చెవులకి సోకింది మధురంగా,
పున్నమి వెన్నెల కురియుచుండ చల్లగా,
చిన్న తల్లి నిదురించే అమ్మ ఒడిలో హాయిగా,
బంగారు పాపను చూసి మురిసింది తల్లి సత్య!
******
2: గాలివానలో వాన నీటిలో...........ఇచ్చిన పాట
జీవన సంద్రంలో కష్టాల గాలివాన తప్పదు,
వాననీటిలో పడవ ప్రయాణమూ తప్పదు,
తీరమెక్కడో తెలియకున్నా పయనం తప్పదు,
గమ్యాన్ని చేరే దారి మనమే వెతుకక తప్పదు,
బ్రతుకు పడవ నిత్యం సాగుతూనే ఉండాలి సత్యా !
*****
ఈ పాట పై పంచపది వ్రాయగలరేమో ప్రయత్నించండి.
“మల్లియలార మాలికలార మౌనముగా ఉన్నారా మా కథనే విన్నారా...”
మీరు వ్రాసిన పంచపది కామెంట్స్ రూపంలో పొందు పరచగలరు.