నీ జాడ ఎక్కడ?
గదిలో నే ఒంటరిగా కూర్చుని ఉంటే
మదిలో నీ తలపులు నా ఎదుటనిల్చి
నీ రాక ఎప్పుడని నన్నడిగాయి
నాకే తెలియదని నేనెలా చెప్పను?
వేసవిరేయి వేకువజాము వరకు
నిదురరాక నిట్టూర్చుతుంటే
నీ మేనిపరిమళము సిరివెన్నెల చేరి
నా గదినిండా నేర్పుగ అలుముకున్నది
నా మదినిండా ఓదార్పు పులుముతున్నది
విగతజీవులైన నా తలపుల తుమ్మెదలు
మగతకన్నుల ఊపిరితో పలవరిస్తున్నాయి
నీ జాణ ఎక్కడనీ? నీ జాడ ఎక్కడనీ?
తెల్లవారిపోతున్ననూ నీ నెచ్చెలి రాలేదేమని
గొల్లున ఎగతాళిగా నవ్వి నిద్రలోకి జారుకున్నాయి
ఖిన్నుడనై ఒంటరిగా మాగన్నులనుండిపోతిని