Menu Close
mg

ముత్యాల చెమ్మచెక్క

వయస్సుతో నిమిత్తం లేకుండా నేడు మనందరం ఎక్కువ సమయం గడుపుతున్నది, ఎల్లవేళలా స్నేహం చేస్తున్నది మన చేతిలో ఉన్న ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం అదే చరవాణి. ఆధునిక పరిజ్ఞానం, టీవీ లు, కంప్యూటర్స్, సెల్ ఫోన్ లు లేని ఆనాటి రోజుల్లో అందరూ, ముఖ్యంగా పిల్లలు ఆరుబయట సాయంత్ర సమయంలో చల్లని గాలుల వాతావరణంలో ఎన్నో ఆటలు ఆడుకునేవారు. ఆనాటి సంఘసమిష్టి మైత్రిబంధం నేడు దాదాపు లేనట్టే.

ఆనాడు ఆడిన ఆటలను ప్రతిబింబించేలా, యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయిల మధ్య చనువుతో కూడిన ఒక మంచి స్నేహంతో సాగే చిలిపి ఆలోచనలను జోడించి వ్రాసిన ఈ పాట మన హృదయాలను హాయిగా స్పృశిస్తుంది. 1964 సంవత్సరంలో విడుదలైన బొబ్బిలి యుద్ధం సినిమాలోని ఈ పాట మీ కోసం.

చిత్రం: బొబ్బిలియుద్ధం
రచన: ఆరుద్ర

సంగీతం: రాజేశ్వరరావు
గానం: పి.సుశీల మరియు బృందం

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో
గాజులు గలగల లాడ

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో
గాజులు గలగల లాడ

తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో
గాజులు గలగల లాడ

ఒప్పులకుప్ప - వయ్యారి భామా
సన్నబియ్యం - చాయపప్పు
చిన్నమువ్వ - సన్నగాజు
కొబ్బరికోరు - బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ - నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు - నీ మొగుడెవడు

ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి
కోరిన పెనిమిటి దొరకవలె
ఆడిన ఆటలు నోములయి
కోరిన పెనిమిటి దొరకవలె

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో
గాజులు గలగల లాడ

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో
గాజులు గలగల లాడ

Posted in July 2020, పాటలు