Menu Close
Geethanjali-page-title

21

I MUST launch out my boat. The languid hours pass by on the shore ⎯ Alas for me!

The spring has done its flowering and taken leave. And now with the burden of faded futile flowers I wait and linger.

The waves have become clamorous, and upon the bank in the shady lane the yellow leaves flutter and fall. What emptiness do you gaze upon!
Do you not feel a thrill passing through the air with the notes of the far away song floating from the other shore?

సీ. గడచిపోయె ఘడియ, పడవ దీయగవలె,
కాలమ్ము రిత్తగా కదలి పోయె!!

తనకార్యము జేసి తరలె ఆమని, నాకు,
వడలిన పూలను వదలి వైచి!

అలల హోరు పెరిగె, జలధి తీరమ్ములో,
ఎండిన పత్రమ్ము లెగిరిపడెను!

---

చూపు నిల్పెద వహో! శూన్యమ్ములోనీవు!
కనువిప్పి ఒకసారి కడలి వైపు

ఆ. అలల తెరల పైన హాయిగొలిపి వీచు,
గాలి సంగతులను కాంచవోయి!
ఒడలు పుల్కరించు పడిలేచు అలపాట
వినుచు తనివితీర మనగదోయి!!!

22

IN the deep shadows of the rainy July, with secret steps, thou walkest, silent as night, eluding all watchers.

To-day the morning has closed its eyes, heedless of the insistent calls of the loud east wind, and a thick veil has been drawn over the ever-wakeful blue sky.

The woodlands have hushed their songs, and doors are all shut at every house. Thou art the solitary wayfarer in this deserted street. Oh my only friend, my best beloved, the
gates are open in my house ⎯ do not pass by like a dream.

సీ. వానమబ్బులు నిండు వర్షంపు ఋతువులో
సద్దుచేయని ముగ్ధ శార్వరివలె

పరుల కంటబడక ప్రచ్ఛన్నముగ నీవు
అడుగులో అడుగేసి నడతువోయి

---

నీలినింగిని కప్పి నిద్దరోయెను పొద్దు
ప్రాక్పవన సడుల పట్టిలేక

కొండకోనలు అన్ని, కోయనుటన్ మానె
నిదురలోనికి జారె, నిఖిల జగము!

ఆ. ఒంటిగా నడిచెద వెందుకోయీ సఖా!
నీవు తక్క నాకు నేస్తులెవరు?
తెరచియుంటి తలుపు! పరచి నా హృదయమ్ము
జారి పోకుమోయి స్వప్నమటుల!

23

ART thou abroad on this stormy night on the journey of love, my friend? The sky groans like one in despair.

I have no sleep to-night. Ever and again I open my door and look out on the darkness, my friend!

I can see nothing before me. I wonder where lies thy path!

By what dim shore of the ink-black river, by what far edge of the frowning forest, through what mazy depth of gloom art thou threading thy course to come to me, my friend?

సీ. కల్లోలితంబైన కటికచీకటి లోన
నిస్సహాయగ నింగి ఉస్సురనగ

యేదూర దేశమ్ము నేగినావో సఖా
ప్రేమకొరకు నీవు వెదకి వెదకి

కంటిమీద కునుకు క్షణమైన లేక, నే
మరల మరల జూతు తెరచి తలుపు

కన్ను లెదుట నిల్చు గాఢాంధకారమ్ము!
ఎచటయుంటివి ప్రభూ!  ఎరుగనైతి!!!

ఆ. చిక్క నైన అడవి చిమ్మ చీకటి కోన
పారు నీలి నదపు తీరమందు
అల్లు చుంటి వోయి అద్భుతమ్మగు దారి
ఇరువురెదల నడుమ నిరతమీవు

24

IF the day is done, if birds sing no more, if the wind has flagged tired, then draw the veil of darkness thick upon me, even as thou hast wrapt the earth with the coverlet of sleep
and tenderly closed the petals of the drooping lotus at dusk.

From the traveller, whose sack of provisions is empty before the voyage is ended, whose garment is torn and dust-laden, whose strength is exhausted, remove shame and poverty, and renew his life like a flower under the cover of thy kindly night.

సీ. పగటికార్యములన్ని ముగిసిపోయిన యంత,
అలసినానని గాలి, తెలిపినంత,

పాడి పాడి పికము గూడుచేరిన వేళ,
నిదుర పొరను పృథ్వి నించినట్లు,

కొలను తామర కండ్లు మెలమెల్లగా మూసి
కలల లోకము లోన నిలిపినట్లు

కాటుక చీకట్లు, కప్పు, నాపై కూడ
మనవిజేతును మాట వినుము స్వామి!

ఆ. వలువ మాసి పోయి వనరులన్నియు దీరి
చిక్కి, బడలి, లోన సిగ్గుపడుచు
నీదు ద్వారమందు నిలుచుపాంథుని! ప్రభూ,
ప్రొద్దుపొడుచు మునుపె బ్రోవుమయ్య!

25

IN the night of weariness let me give myself up to sleep without struggle, resting my trust upon thee. Let me not force my flagging spirit into a poor preparation for thy worship.

It is thou who drawest the veil of night upon the tired eyes of the day to renew its sight in a fresher gladness of awakening.

నీవు పజ్జ నుండ నిశ్చింతగా నేను
కనులు మూసుకొందు కలత వీడి
పేదపూజ కొరకు పెత్తనమ్ములు మాని
నన్ను అప్పగించి మిన్నకుందు!!

అలయు కనుల పైన యామినీ పటలమ్ము
పరతువోయి నీవు పరమదయతొ
కొత్త చూపు తోడ నెత్తావులన్ చల్లు
ప్రకృతి మాత యొడిని పరవశింప

26

HE came and sat by my side but I woke not. What a cursed sleep it was, O miserable me!

He came when the night was still; he had his harp in his hands, and my dreams became resonant with its melodies.

Alas, why are my nights all thus lost? Ah, why do I ever miss his sight whose breath touches my sleep?

సీ. గాఢ నిదురలోన కలల మునిగి యుంటి
ప్రక్కనున్న ప్రభుని పట్టి లేక!!!

ఎంతనిర్భాగ్యుండ ఎంతవెర్రినొ‌ నేను
అమృత ఘడియలందు అలసియుంటి!!!

అరుదెంచె ప్రభు తాను, అర్ధరాత్రమునందు,
అద్భుతమ్మగు రాగ మాలపించి!!

రాగరంజితముగ సాగె నా స్వప్నమ్ము
కలల లోకమునుండి కదలకుంటి

ఆ. వట్టివయ్యె నయ్యొ! ఇట్టి రాత్రులు యెన్నొ
చెంతనున్న అతని చేరలేక
శ్వాస లోన నిండు స్వామినే చూడకన్
వ్యర్థ మైన బ్రతుకు బ్రతుకుచుంటి

27

LIGHT, oh where is the light? Kindle it with the burning fire of desire!

There is the lamp but never a flicker of a flame, ⎯ is such thy fate, my heart! Ah, death were better by far for thee!

Misery knocks at thy door, and her message is that thy lord is wakeful, and he calls thee to thy love-tryst through the darkness of night.
The sky is overcast with clouds and the rain is ceaseless. I know not what this is that stirs in me, ⎯ I know not its meaning.

A moment's flash of lightning drags down a deeper gloom on my sight, and my heart gropes for the path to where the music of the night calls me.

Light, oh where is the light! Kindle it with the burning fire of desire! It thunders and the wind rushes screaming through the void. The night is black as a black stone. Let not the hours pass by in the dark. Kindle the lamp of love with thy life.

సీ. ఏది దీపమ్మేది! ఎందుంచితో కదా!
జ్వలియించు ఆర్తితో వెలగనిమ్ము!!

వట్టి ప్రమిద కన్న మట్టి జేరుటమేలు!
తలరాత కాబోలు తరచి జూడ!!

తలుపుతట్టి తెలిపె దౌర్భాగ్యమీనాడు
నైరాశ్యమేలంచు నన్ను గాంచి -

"వేలకనులతోడ వేచియుండె ప్రభువు,
నీదు ప్రేమ కొరకు నిరత" మనుచు

ఆ. గగనభాగ మంత కప్పివేసెను మబ్బు,
వర్షధార నిండె వసుధ యంత!!
మనసులోన యేదొ మథనమ్ము కొనసాగె,
ఇట్టిదనుచు నేను యెరుగ నైతి!!

---------

ఆ. కనులు చెదరి పోవు కాంతిపుంజమొకటి,
అరనిమిషము నన్ను అంధు జేసె!!
వెదకసాగె నాదు హృదయమ్ము రేయి, తా
నాలపించు గీతి ఆత్రపడుచు!!

ఆ. నల్లరాతి నింగి నలువైపులుండనీ
అంధకార మందు అలమటేల?
ప్రేమ జ్యోతి నింపు వేలదివ్వెలకాంతి
తీసివేయునోయి తిమిరమంత!!!

28

Obstinate are the trammels, but my heart aches when I try to break them. Freedom is all I want, but to hope for it I feel ashamed.

I am certain that priceless wealth is in thee, and that thou art my best friend, but I have not the heart to sweep away the tinsel that fills my room.

The shroud that covers me is a shroud of dust and death; I hate it, yet hug it in love.

My debts are large, my failures great, my shame secret and heavy; yet when I come to ask for my good, I quake in fear lest my prayer be granted.

సీ. కఠినమీ సంకెళ్ళు కట్టునా హృదయమ్ము
గుండె పగిలిపోవు కోసినంత

కోరి స్వేచ్ఛకు నేను గొంతుపగిలి యేడ్చి
సిగ్గుతో తలవంతు చేరినంత

ఐశ్వర్యముల నిచ్చు ఆప్తమిత్రుడవీవు
వట్టికుండల, నేను, వదల నైతి

మరణమన్న వలువ వెరచి వద్దంచునే
మరల మరల మార్చి మురిసి పోదు

ఆ. తీరి పోని ఋణము కోరినంతగలదు
గెలుపు అన్నదెపుడు తెలయలేదు
అన్ని తీర్చు ముక్తి అడిగినీ యెదుటనే
వరము నిత్తు వనుచు వణికి పోదు

Posted in July 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!