Menu Close
మన తెలుగు కొరకు...
- రాఘవ మాష్టారు -
  1. తెలుగే మన వెలుగు
    చేయకు కను మరుగు
  1. తెలుగు మన జీవనం
    మనల నుడి పావనం
  1. తెలుగు పెను పొలుపు
    మనుగడ కది మలుపు
  1. తెలుగంటే తీపి పంచదార
    తెలుగంటే తావి పాలధార
  1. తెలుగు మన అమ్మ నుడి
    అమ్మ అనురాగ పు ఒడి
  1. తెలుగొక తీపి గుళిక
    పలుకుల తావి మొలక
  1. తెలుగు అంటే అమ్మదనం
    తెలుగు వింటే కమ్మదనం
  1. తెలుగు మమతల చల్లని గుడి
    వెలుగులొలుకెడి ఎల్లల నుడి
  1. తెలుగు పలికే తీపి కలకండ
    తెలుగు చదువే అండదండ
  1. మన భాషను ప్రేమిద్దాం
    పర భాషను ఆదరిద్దాం
  1. తెలుగే కదా మన వెలుగు
    చేయకు దానిని కనుమరుగు
  1. కన్న తల్లిని మరవద్దు
    అమ్మ నుడిని వదలొద్దు
  1. తేనె కన్న తీయనన్న
    మన అమ్మ నుడే గొప్పన్న
  1. ఆంధ్రము సున్న మాయె,
    ఆంగ్లము బెల్లమాయె.
    చదువేమో తెల్ల బోయె
  1. అమ్మ బాసను అలుసు చేయకు
    అన్య భాషలో ఉసు లాడకు
  1. తెలుగు మన హక్కు
    కాదంటే కదను తొక్కు
  1. తెలుగుకుంది తలకట్టు
    తెలుగోడి కది పిడి పట్టు
    కాదన్నవాడి పని పట్టు
  1. ఏలికలో పాలికలో తెలుగు,
    వాడుకలో వేదికలో తెలుగు
    అందుకై వేయాలి అడుగు
  1.  గడప గడపలో తెలుగు
    గొంతు గొంతులో తెలుగు
  1. తెలుగులో మాట్లాడదాం
    తెలుగుకై కొట్లాడదాం
Posted in September 2022, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!