అమ్మదొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగ..
మనకు సాధారణంగా ఎంతో మాదుర్యప్రధానమై, భావపూరితమైన సినిమా పాటలు మనసుకు హత్తుకొని ఎంతో అనుభూతిని కలిగిస్తాయి. కానీ అసలు సంగీతానికే ఆ మహత్తు ఉందని, సినిమాల కోసం కాకుండా ప్రత్యేకమైన శైలితో వ్రాయబడి లలిత సంగీతాల మిళితమైన కొన్ని గేయాలను వింటున్నప్పుడు మనకు తెలిస్తుంది. అటువంటి పాటలను రచించిన వారే వాటిని స్వరపరచడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ప్రముఖ గేయ రచయిత మరియు సంగీత దర్శకుడు పాలగుమ్మి విశ్వనాథ్ గారు వ్రాసి స్వరపరచిన "అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా" పాటను ఈ ఉగాది సంచిక సందర్భంగా మీకు అందిస్తున్నాము. ఈ గేయాన్ని పాడినవారు శ్రీమతి వేదవతీ ప్రభాకర్. ఒకసారి విన్నంతనే మరల మరల వినాలనే ఉత్సుకతను మరియు మంచి జీవితానునుభూతులను నేమరేసుకొనే విధంగా చేస్తున్న ఈ మధుర గాయాన్ని మనకు అందించిన విశ్వనాథ్ గారికి, అంతే వీనుల విందుగా పాడిన వేదవతి గారికి నమస్సుమాంజలులు.
రచన మరియు స్వరకల్పన: శ్రీ పాలగుమ్మి విశ్వనాథ్
గానం: శ్రీమతి వేదవతీ ప్రభాకర్
అమ్మదొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగ.. |అమ్మదొంగా|
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ ఊ..ఊ..ఊ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కలకలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను... చూడకుంటే.. నాకు బెంగ...|అమ్మ దొంగా|
కధ చెప్పే దాకా కంట నిదుర రాకా...
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా...
కధ చెప్పే దాకా నన్ను కదలనీక....
మాటతోచనీక...మూతి ముడిచి చూసేవు
అమ్మదొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగ.. |అమ్మదొంగా|
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె
నిలువలేక నా మనసు నీ వైపే లాగితె
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె
నిలువలేక నా మనసు నీ వైపే లాగితె
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా
అమ్మదొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగ.. |అమ్మదొంగా|
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అదిచాలు
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే పదివేలు
కలతలూ కష్టాలు నీ దరికి రాకా
కలకాలము నీబ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీదరికీ రాకా
కలకాలము నీబ్రతుకు కలల దారి నడవాలి
అమ్మదొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగ.. |అమ్మదొంగా|
చిన్న నాటి స్మృతి దాదాపు దశాబ్దాల తరువాత ఈరోజు విన్నాను
What a Bonding and Heart Touching Song.Thanks for sharing and i am blessed to listen this song.విశ్వనాథ్ గారికి, వేదవతి గారికి నమస్సుమాంజలులు.