Menu Close
Uma-Bharathi-SSS-02
కధనం - నృత్యం – గీతం .. సాహిత్య - సాంస్కృతిక - సమ్మేళనం
దృశ్య మాలికా పరంపరలు - భావయుక్త కథానికలు
‘నాట్యభారతి’ – ఉమాభారతి

'అంతా రామమయం' శ్రీరాముని చరితం నుండి ఘట్టాలని - పద్య, గద్య, గాన, చిత్రలేఖనం ద్వారా ప్రత్యేక సమర్పణ

జీవితంలో ఎటువంటి విపరీతాన్నైనా , చెక్కుచెదరకుండా , సత్యమార్గాన్ని వీడకుండా స్వధర్మాన్ని ఆచరిస్తూ ... తన జీవితాన్ని అత్యంత సమతుల్యతతో నిర్వహించుకున్న యుగపురుషుడు రామచంద్రుడు. అందరికీ ఆరాధ్య దైవం. ఆయన దివ్యచరితం నుండి కొన్ని విశిష్ట ఘట్టాలని పద్య, గద్య, గాన, చిత్రలేఖనం వంటి కళల ద్వారా సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం..

***అహల్య శాపవిమోచనం, రామ భక్తురాలు శబరి చరితం, రామ పట్టాభిషేకం, సర్వ రక్షాకర 'రామ జపం' .

“రోజూవారీ జీవనంలో శ్రమించి, విసిగి వేసారిన మనుషులకి, ఆహ్లాదం, ఉల్లాసం అవసరం కనుక కళలు జనించాయని.. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్యం, సంగీతం, నృత్యం మనసుని ఉత్తేజపరచే సాధకాలే” అని ఐదవ వేదంగా పరిగణింపబడే నాట్యశాస్త్రంలో ప్రస్తావించారు.

కళకళలాడే జీవనం అంటే ఆందోళన రహిత జీవన విధానం అని, అందుకోసం నిత్యచైతన్యానికి, ఆనందానికి దారులు అన్వేషించాలనీ సూచించే సిద్దాంతాలు ఎన్నో నిజ జీవన చట్రంలో ఇమిడి వున్నాయి.

అలా ఆందోళన తొలగి, ఉత్సాహం ఉప్పొంగాలన్నా, ఆనందం ఉరకలు వేయాలన్నా ... ఓ కమ్మని రాగం, ఓ చక్కని దృశ్యం, ఓ దివ్యమైన కావ్యం చాలునేమో అని అనిపిస్తుంది.

అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ వారి ‘సాహిత్య – సాంస్కృతిక - సమ్మోహనం’ అనే ఈ vlog సిరీస్ లో .. వచనం, రచనం, గీతం, నృత్యం, కథనం ద్వారా సంగీతం, సాహిత్యం, నర్తనం, చిత్రలేఖనం వంటి కళలు వీక్షకులకి వినోదాన్ని పంచుతాయని ఆశిస్తూ ఈ సరికొత్త శీర్షిక ద్వారా దృశ్య మాలికా పరంపరలను మీకందించే ప్రయత్నం చేస్తున్నాము. మీ సూచనలు సలహాలు శీర్షిక క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలుప కోరిక.

నమస్కారములతో –
‘నాట్యభారతి’ ఉమాభారతి
కూచిపూడి నాట్యకారిణి, నాట్య గురువు, నటి, రచయిత్రి, టీవీ చిత్ర నిర్మాత – దర్శకురాలు
అర్చన ఫైన్- ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంస్థాపకురాలు

********

Posted in December 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *