Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

అంశం: అష్టాదశ శక్తి పీఠాలు

గతసంచిక తరువాయి »

సాహితీ మిత్రులకు....

ఈ నెలతో అష్టాదశ శక్తి పీఠాలు – 18 :  పంచపదులు పూర్తయ్యాయి.

14. శక్తి పీఠాలు: మాధవేశ్వరి దేవి

ప్రయాగ శక్తి పీఠేశ్వరీ మాధవేశ్వరీ నమామి,
ఊయల రూపాన పూజలందుకునే దేవీ నమామి,
సతి ముంజేతి నుంచి ఉద్భవించిన దేవీ నమామి,
పెళ్లి కూతుర్లకు అభయ ప్రదాతా దేవీ నమామి,
మహిమాన్వితం పధ్నాలుగవ శక్తి పీఠం సత్యా!

15. శక్తి పీఠాలు: జ్వాలముఖి/వైష్ణవి దేవి

సతీ శిరో భాగోధ్భవీ నమో వైష్ణవీ దేవీ,
మహాలక్ష్మి, మహాకాళి, మహా వాణీ తేజోధ్భవీ,
భైరవ సంహారిణీ, త్రిశిర రూపిణీ నమో దేవీ,
పంచాదశ శక్తి పీఠ స్థితే నమో వైష్ణవీ దేవీ,
పిండీల రూపాన ఉన్న అమ్మవారు దర్శనీయము సత్యా!

16. శక్తి పీఠాలు: మంగళ గౌరి

సతీ ఊరువోధ్భవ దేవీ మంగళగౌరీ నమః,
సాలగ్రామ రూపణ్య పూజితే మంగళగౌరీ నమః,
వర ప్రదాయనీ, దయామయీ మంగళగౌరీ నమః,
స్త్రీ ఆరోగ్య, మాంగల్య రక్షకీ మంగళగౌరీ నమః,
గయ, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి సత్యా!

17. శక్తి పీఠాలు: కాశీ విశాలాక్షి

సతీ కర్ణకుండలోధ్భవి మణికర్ణికా దేవి,
అర్చామూర్తీ, స్వయంభువు ద్విరూపిణి పార్వతీదేవి,
కన్యాం శీఘ్ర వివాహ వర ప్రదాత విశాలాక్షీ దేవి,
సప్తాదశ కాశీ పీఠ స్థిత అన్నపూర్ణా దేవి,
కాశీలో కొలువైన ఆదిదంపతులకు ప్రణామాలు సత్యా!

18. శక్తి పీఠం: సరస్వతి

జమ్ము కాశ్మీర్ లో స్థితమై ఉంది. అమ్మవారిని కీర్ భవాని అని కూడా పిలుస్తారు.

పై  అంశం గురించి ఆసక్తి కలవారు దానిపై పంచపది, సమీక్ష రూపంలోవ్రాయ ప్రయత్నించగలరు.

ఈ లింక్ లో సమాచారం దొరుకుతుంది.

*** సశేషం ***

Posted in November 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!