Menu Close
mg
Song

సిరివెన్నెల

అతి సరళమైన పదాలతో ఎంతో నిగూఢమైన భావుకతను ప్రదర్శించగలిగే సాహిత్య పటిమవున్న గేయ రచయితలు ఎందఱో మన చిత్రసీమలో ఉన్నారు. అటువంటి వారిలో ఈ మధ్య కాలంలోనే సినీజగత్తును దుఖసాగరంలో ముంచి దివికేగిన సిరివెన్నల సీతారామశాస్త్రి గారు ముందు వరసలో ఉంటారు. ఆయన రచించిన గేయాలన్నీ విరచితాలే. అంటే ఎంతో విశేషణను కలిగి మనసును ఆకట్టుకునే భావుకత ను నింపుకుని ఉంటాయి. తెలుగు సినీ పరిశ్రమ ఆ మహానుభావుని సాహిత్యాన్ని ఇకపై చూడలేదు. శ్యాం సింగ రాయ్ చిత్రం కోసం సీతారామ శాస్త్రి గారు వ్రాసిన చివరి పాట మీ అందరి కోసం ఇప్పుడు అందిస్తున్నాము.

movie

శ్యాం సింగ రాయ్ (2021)

music

సిరివెన్నల సీతారామశాస్త్రి

music

మిక్కీ జె మేయర్

microphone

అనురాగ్ కులకర్ణి

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం

నెల రాజుని ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా

నడి రాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటి కలా

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కళా

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం

ఓ ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల
తన కలలను కనుగొని
అచ్చెరువున మురిసి

అయ్యహో ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో
నారీ సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే

తెర దాటి చెర దాటి
వెలుగు చూస్తున్న భామని
సరిసాటి ఎదమీటి
పలకరిస్తున్న శ్యాముని
ప్రియమార గమనిస్తూ
పులకరిస్తోంది యామిని

కలబోసే ఊసులే ఓ ఓ
విరబోసే ఆశలై ఓ ఓ
నవరాతిరి పూసిన వేకువ రేఖలు
రాసినదీ నవలా

మౌనాలే మమతలై ఓ ఓ
మధురాలా కవితలై ఓ ఓ
తుది చేరని కబురుల
కథాకళి కదిలెను
రేపటి కధలకు మున్నుడిలా

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కళా

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం

ఇదిలా అని ఎవరైనా
చూపనేలేదు కంటికి
అదెలాగో తనకైనా
తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైన
రేపు దొరికింది చూపుకి

సంతోషం సరసన ఓ ఓ
సంకోచం మెరిసిన ఓ
ఆ రెంటికి మించిన పరవశ లీలను
కాదని అనగలమా

ఆ కథ కదిలే వరుసనా ఓ ఓ
తమ ఎదలేం తడిసినా ఓ ఓ
గత జన్మల పొడవున
దాచిన దాహము ఇపుడే
వీరికి పరిచయమా

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కళా

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కళా

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం

Posted in November 2022, పాటలు