Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

పంచపదులు అంటే ఏమిటో, అవి వ్రాసే విధానము, నియమాలు తెలుసుకున్నాము. గత నెల కుటుంబము అనే అంశం పై నేను వ్రాసిన  పంచపదులు చదివే ఉంటారు కదా!

ఈ సారి: చక్కెర వ్యాథి పై, నేను వ్రాసిన పంచపదులు .....(సరదాగా వ్రాసినవే సుమండీ!)

1.
అతిగా చక్కెర తినవద్దండీ,
మొదటికే మోసం వచ్చునండీ,
చక్కెర వ్యాథికి చిక్కేరండీ,
తీపికి సదా దూరమయ్యేరండీ,
చక్కెర చిక్కులు తెచ్చేను సత్యా!
2.
బిక్కముఖం వేసేరండీ,
దిక్కుతోచక వగచేరండీ!
వైద్యుని చూడబోయేరండీ,
మెత్తగ బుద్ధిని గరిపేరండి,
మందులు వాడితే చక్కెర తగ్గును సత్యా!
3.
మందులు మింగమనునండీ,
తప్పక చెక్కర్లు కొట్టమనునండీ,
వ్యాయామం చెయ్యమనునండీ,
కాకర బాగా తినమనునండీ,
డాక్టరు సలహా పాటించవలె సత్యా!
4.
వైద్యుని సలహా పాటించవలెనండి,
పాటించకున్న ప్రమాదమగునండి,
చక్కగ పాటించిన చక్కెర తగ్గునండి,
నిశ్చింతగ బ్రతుకు గడుప వచ్చండి,
చక్కెరను నియంత్రణ చేసిన సుఖము సత్యా!

ఆసక్తిగలవారు, ఈ అంశం పై, 1 లేదా 2 పంచపదులు, Comments Box లో వ్రాయగలరు. అయితే ఎవ్వరినీ నొప్పించే పదజాలం వాడవద్దని మనవి.

వచ్చే నెల మరొక అంశం పై పంచపదులతో కలుద్దామా!

*** సశేషం ***

Posted in May 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!