నీ చరణం కమలం మృదులం
చిత్రం: జానకిరాముడు (1988)
గేయ రచయిత: ఆచార్య ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: బాలు, జానకి
పల్లవి:
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం

నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు.. ఏడేడు జన్మాలు…
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలూ …
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
చరణం 1:
మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు

అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు

ఎదుటే నిలిచిన చాలు.. ఆరారు కాలాలూ…
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
చరణం 2:
జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు

అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు

ఎదురై పిలిచిన చాలూ.... నీ మౌన గీతాలూ