Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౫౦౧. అవ్వంటేనే ముసలమ్మ, కాదంటే నన్ను కర్రతో కొట్టు ...

౫౦౨. పాము శత్రువైతే, పడగ చుట్టమౌతుందా?

౫౦౩. తాగింది దమ్మిడీ కల్లు, ఇల్లంతా చెడ ఊశాడు.

౫౦౪. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి!

౫౦౫. పందికేమి తెలుస్తుంది పన్నీరు పస.

౫౦౬. కుక్క తెచ్చేవి కక్కలే!

౫౦౭. మొండి వాడికి మొగలిపువ్వు ఇస్తే, ముడిచి ముక్కులో దూర్చుకున్నాడుట!

౫౦౮. కాకులన్నీ చేరి కావుకావు మని అరిస్తే, కూలిపోతుందా ఏమి కోకిల పరువు!

౫౦౯. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందిట!

౫౧౦. అడుసు తొక్కనేల, కాలు కడగనేల!

౫౧౧. బురద కెలకడం ఎందుకు, వాసనని ముక్కు పిండుకోడం ఎందుకు?

౫౧౨. గాలికి ఊగులాడే చెట్టు గాలివానవస్తే నిలుస్తుందా?

౫౧౩. దొంగ ఊబిలో చిక్కాక దొరైనా తప్పించుకో లేడు.

౫౧౪. ఇంటి గుట్టు లంకకు చేటు.

౫౧౫. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు.

౫౧౬. బిడ్డనిస్తే పగ, డబ్బు ఇస్తే దగా తప్పవు.

౫౧౭. తుంటి మీద కొడితే, మూతిపల్లు రాలాయిట!

౫౧౮. గుడ్డీ, కుంటీ కూడి కాశీ యాత్ర చేశారుట!

౫౧౯. దమ్మిడీ ముండకు డబ్బు క్షవరం!

౫౨౦. మతిచెడి మట్టిపిసికితే మాణిక్యం దొరికిందిట!

౫౨౧. కాణీ కట్నమూ లేదు, దమ్మిడీ ఆదాయమూ లేదు...

౫౨౨. ఎంత చెట్టుకు అంత గాలి.

౫౨౩. పుండుకి పుల్ల మొగుడు.

౫౨౪. కుక్కలు వెతికేది కక్కల కోసమే ...

౫౨౫. నక్కలు బొక్కలు వెతుకుతాయి.

౫౨౬. బ్రతుకు తక్కువ, బడాయి ఎక్కువ.

౫౨౭. నెత్తిని రూపాయి ఉంచినా ఏగానీ విలువ చెయ్యడు.

౫౨౮. ఏనుగు దారిన పోతూంటే చూసి కుక్కలు మొరుగుతాయి.

౫౨౯. ఉల్లిపూవు ఉల్లిపూవే, మల్లిపూవు మల్లిపూవే!

౫౩౦. నెమిలి ఈకలు కట్టుకుని ఆడినా కాకి కాకే!

Posted in June 2019, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!