Menu Close
Kadambam Page Title
గౌరవం దక్కనిదెవరికి…?
-- పోలయ్య కూకట్లపల్లి --

పాలివ్వని గేదెకు…
పరిమళించని పువ్వుకు...

పచ్చని సంసారానికి
పనికిరాని యువకుడికి…
చదువురాని విద్యార్థికి…
ఉద్యోగంలేని నిరుద్యోగికి…

పండని కాయకు…
ఎండిన పువ్వుకు…
ఎదగని మొక్కకు…
రాలిపోయిన ఆకుకు…
ఆరిపోయిన అగ్గిపుల్లకు…
పుచ్చిపోయిన కూరగాయకు…
ఎన్నడూ అరవని కరవని కుక్కకు…
ఎప్పుడూ కరగని కురవని మేఘానికి…

కష్టాల కాపురంలో ఆర్జించిన ఆస్తులన్నీ
ప్రేమతో పిల్లలకు ప్రసాదంలా పంచి...
నయవంచకులైన పిల్లల పంచన చేరి
గాలివానలో ఆకులవోలే అనాధలై...

ఆశతో, ఆవేదనతో, ఆకలితో
అలమటించే అస్థిపంజరాలై...
బిక్కుబిక్కుమంటూ బికారుల్లా...ఏ
దిక్కుమొక్కులేని విలువేలేని వెలుగేలేని
చీకటి బ్రతుకు బ్రతికేటి అమ్మానాన్నలకు…

Posted in December 2025, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *