Menu Close
Kadambam Page Title

భావం - సౌందర్యం

- పి.వి.ఎల్. శైలజ

కేరింతల ఉల్లాసపు భావం బాల్యానికి సౌందర్యం

విద్యా వికాసపు భావం యువతకు సౌందర్యం

బాధ్యతాయుత భావం వయోజనపు సౌందర్యం

 

అందమైన అంతరంగ భావం ముఖానికి సౌందర్యం

సాదర సంతృప్తీ భావం ఆరోగ్యపు సౌందర్యం

వినయవిధేయతా భావం విద్యకు సౌందర్యం

 

సహన సౌశీల్యతా భావం మనుగడకు సౌందర్యం

మసిమాయని మనోభావం మానవత్వపు సౌందర్యం

మంచి మానవత్వపు భావం మనిషి  ప్రగతికి సౌందర్యం

 

మనసు ప్రకంపనల ప్రకటీకృతమే భావం

మనసులోని భావాస్వాదపు సౌందర్య వ్యక్తీకరణయే.....భావ సౌందర్యం

Posted in June 2019, కవితలు

14 Comments

  1. Narahari Sathya Narayana

    Madam, Mee bhava soundaryam Mee manasunee mariyu Mee manobhavanee prathipalisthunadi. Ettlu Mee sodaruduu Sathya Narayana.

  2. SAILAJA PVL

    బంధువులూ స్నేహితులూ…. వీరి ప్రేరణ కు నా నమస్సులు.

  3. G Sandhya Jagadish

    అంతరంగ భావం ప్రకటన వివరించిన విధానం చాలా బాగుంది శైలా 👌👌😍😊

  4. Bala

    హాయ్ శైలూ
    చాలా బాగుంది కవిత. అందమైన సాహిత్యం తో, రైమింగ్ తోచక్కగా రాసావు. మంచి తెలుగు భాష లో చదివి చక్క గా ఉంది. Keep it up
    Bala vadina

  5. గోపి

    “సహన సౌశీల్యతాభావం మనిషి మనుగడకు సౌందర్యం” – ఇది అక్షరాలా ఆచరిస్తే ప్రతి ఒక్కరి జీవితం సౌందర్యభరితమే. చాలా బాగుంది అక్కా.

  6. పి. వి. ఎల్. శైలజ

    అనుపమ గారికి భావయుక్త కృతజ్ఞతలు

  7. Anupama Dasam

    చాల బాగా రాసారు ,చెప్పారు అమ్మ.మనిషి ఎలా ఉండాలో, బ్రతకాలో వివరించారు।

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!